నల్గొండ జిల్లా: జిల్లాలో సోమవారం తెల్లవారు జామున మర్రిగూడ దగ్గర ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదానికి గురై పూర్తిగా దగ్ధమైన ఘటనలో ఒకరు సజీవ దహనం కాగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.వివరాల్లోకి వెళితే…
38 మంది ప్రయాణికులతో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ వస్తుండగా ఏసీ డెమో నుంచి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడి బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.