నల్లగొండ జిల్లా: వేసవిని దృష్టిలో పెట్టుకొని రైతులకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకండా చూడాలని రాష్ర్టరోడ్లు,భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
ఆదివారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ,ఇరిగేషన్,వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి నల్గొండ నియోజకవర్గ పరిధిలో పలు గ్రామాల్లోని చెరువులు, కుంటలు,చిన్ననీటి పారుదల ప్రాజెక్టులను సందర్శించి పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యాసంగి పంటల కోతలు అయ్యేవరకు సాగునీటి ఎద్దడి లేకుండా చూడాలన్నారు.రైతులు కూడా నీటి కోసం కాలువలకు గండ్లు కొట్టకుండా అందరికీ అందేలా సహకరించాలని కోరారు.