యాదాద్రి భువనగిరి జిల్లా:వేసవి కాలం మొదలు కాకముందే ప్రజలకు నీటి కష్టాలు మొదలయ్యాయి.చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో వేసవి కాలం రాకముందే మంచి నీటి సమస్య మొదలై ఇప్పటికే పలు వార్డుల్లో ట్యాంకర్ల ద్వారా మున్సిపల్ సిబ్బంది ఇంటింటికీ నీటిని సరఫరా చేస్తున్నారు.
ఇంటికి 2 నుంచి 3 డ్రమ్ముల నీరు మాత్రమే పోస్తున్నారని,అవి ఎటూ సరిపోవడం లేదని పట్టణ వాసులు వాపోతున్నారు.మంచి నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
లేదంటే రాబోయే రోజుల్లో మరింత ఇబ్బంది ఏర్పడే అవకాశాలు ఉన్నాయని ఆందోళన చెందుతున్నారు