నల్గొండ జిల్లా: మిర్యాలగూడ ప్రాంతానికి ఇతర జిల్లాల నుండి భారీ మొత్తంలో ధాన్యం లారీలు రావడంతో మిల్లర్లు తక్కువ ధరలు చెల్లిస్తున్నారంటూ స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేయడంతో జిల్లా అదనపు కలెక్టర్ ఆదేశాల మేరకు,పోలీసు,రెవిన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు వాడపల్లి, ఆలగడప వద్ద చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి ఇతర ప్రాంతాల ధాన్యాన్ని రాకుండా కట్టడి చేశారు.ఈ విషయం తెలియని ఇతర ప్రాంతాల రైతులు ఆదివారం మిర్యాలగూడ మండలం ఆలగడప చెక్ పోస్ట్ వద్దకు భారీ సంఖ్యలో ధాన్యాన్ని తీసుకురావడంతో అధికారులు అడ్డుకున్నారు.
ముందసస్తు సమాచారం ఇవ్వకపోవడంతో పచ్చిధాన్యాన్ని తీసుకొచ్చామని, మిల్లులకు తరలించకపోతే ధాన్యం పాడైపోతుందని, పక్క జిల్లా ధాన్యం లారీలని ఆపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తూ అధికారులతో వాగ్వాదానికి దిగారు.దీనితో ఉన్నతాధికారులు స్పందించి ధాన్యాన్ని మిల్లులకు పంపించే ఏర్పాటు చేయాలని కోరడంతో అధికారులు ధాన్యాన్ని మిల్లులకు తరలించడానికి అనుమతినిచ్చారు.