ప్రభుత్వ అలసత్వం వల్ల గురుకుల వ్యవస్థ అస్తవ్యస్తం:మేడి ప్రియదర్శిని

ప్రభుత్వ గురుకుల హాస్టళ్లకు కనీస మౌలిక సదుపాయాలు కొరవడంతో గురుకుల హాస్టల్స్( Gurukul Hostels ) సమస్యల వలయంలో కొట్టు మిట్టాడుతున్నాయని బీఎస్పీ నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని అన్నారు.బుధవారం నార్కట్ పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెంలో ఉన్న ప్రభుత్వ గురుకుల హాస్టల్ సందర్శించి,విద్యార్థులతో కలిసి భోజనం వసతిని పరిశీలించారు.

 Students Facing Lack Of Facilities Problems In Gurukul Hostel,gurukul Hostel,nal-TeluguStop.com

అనంతరం ఆమె మాట్లాడుతూ ఈ హాస్టల్లో అడుగడుగునా సమస్యలు తిష్ట వేశాయన్నారు.ఏ హాస్టల్లో చూసినా వసుతుల కొరవడి,ప్రభుత్వం పర్యవేక్షణ లోపం వల్ల, గాడితప్పిన నిర్వహణతో దయనియ స్థితిలో పడ్డాయని అన్నారు.

రాత్రి వేళలో చలి వణికిస్తుండగా కనీసం దుప్పట్లు సైతం సరఫరా చేయక విద్యార్థులు గజగజలాడుతున్నారని,కనీసం క్లాస్ రూంల్లో బెంచీలు లేక కింద కూర్చుని చదువుకోవాల్సిన దారుణమైన పరిస్థితి ఉందని,హాస్టల్లో గదుల తలుపులు,కిటికీలు సక్రమంగా లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారని,వర్షాకాలం లో సరైన పారిశుద్ద్యం పాటించకపోవడం వల్ల దోమల బారిన అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని అన్నారు.ఒక్క రూమ్ లో 20 మంది ఉండగా వారికీ పడుకోవడానికి ప్లేస్ లేక తరగతి గదిలో పడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

హాస్టలో వంట గది,పిల్లలు తినడానికి డైనింగ్ హాల్ లేక విద్యార్థులు బయటే నిల్చోని తినే పరిస్థితి ఏర్పడిందన్నారు.రేకుల షెడ్ తో డైనింగ్ హాలు ఏర్పరచగా దాని పహరి గోడ కూలి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

ప్రతీ హాస్టల్ కు సన్న బియ్యం( Rice ) పంపిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం ఎక్కడ పంపిస్తున్నారో చూపెట్టాలని నిలదీశారు.జావలో పురుగులు, ఈగలు వస్తున్నాయని పిల్లలు తమ గోడు వెళ్లబోసుకున్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకుని అన్ని హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలన్నారు.గురుకులాలకు రావల్సిన నిధులు ఏ దొంగల జేబుల్లోకి పోతున్నయో బీఆర్ఎస్ పార్టీ( BRS Party ) ప్రతినిధి అయిన ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్,నార్కట్ పల్లి మండల అధ్యక్షులు చెరుకుపల్లి శాంతి కుమార్,చిట్యాల మండల అధ్యక్షులు గ్యార శేఖర్, నార్కట్ పల్లి మండల కార్యదర్శి మేడి వాసుదేవ్, మండల కోశాధికారి పాల మహేష్,చిట్యాల మండల కోశాధికారి మునుగోటి సత్తయ్య,పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube