నల్లగొండ జిల్లా:బస్సు సౌకర్యం లేక బడికి వెళ్ళాలంటే రోజూ 6 కి.మీ.
నడిచి వెళ్ళాల్సి వస్తుందని నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం కాచారం గ్రామానికి చెందిన విద్యార్దులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.నడిచి వెళ్ళేటపుడు పుస్తకాలు బ్యాగులను మోయలేక అవస్థలు పడుతున్నామని గోడు వెళ్లబోసుకున్నారు.
పిల్లల పరిస్థితిపై స్థానిక నాయకులు ఎన్నిసార్లు దేవరకొండ డిపో మేనేజర్ కి విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.స్థానిక ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి చొరవ తీసుకొని గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని వేడుకుంటున్నారు.