సమాజాన్ని మానవీకరించే సాధనం అంబేద్కర్...దేశపతి శ్రీనివాస్

నల్లగొండ జిల్లా: సమాజాన్ని మానవీకరించే గొప్ప సాధనం డాక్టర్ బీ.ఆర్.

 Ambedkar Is The Tool To Humanize The Society , Ambedkar , Nalgonda District , D-TeluguStop.com

అంబేద్కర్ అని ప్రముఖ కవి,వాగ్డేయ కారుడు,తెలంగాణ ఉద్యమకారుడు,శాసన మండలి సభ్యులు దేశపతి శ్రీనివాస్ అన్నారు.గురువారం జిల్లా కేంద్రంలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ సెల్స్ సంయుక్తంగా డా.బాబూ జగ్జీవన్ రామ్, జ్యోతిబా పూలే,భారత రత్న డా.బి.ఆర్.అంబేద్కర్ వంటి మహనీయుల జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఉపకులపతి ఆచార్య గోపాల్ రెడ్డి అధ్యక్షతన విద్యార్థులతో సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యాతిథిగా హాజరై మాట్లాడుతూ నిత్య జీవితంలో మనకు ఎదురయ్యే అవరోధాలను ఎదురించి ఎలా ఎదగాలో ఆ మహనీయుల జీవిత చరిత్రలు మనకు ఒక సందేశమన్నారు.భారత సమాజం అందరికీ వడ్డించిన విస్తరి కాదని, పాదాలు నెత్తురోడుతున్న బాటలు వేసిన మహనీయుల చరిత్ర చదివితే మనకు ప్రస్పుటంగా అర్ధం అవుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో రిజిస్టార్ ఆచార్య తుమ్మ కృష్ణారావు,ఓఎస్డి ఆచార్య అల్వాలా రవి,ఎస్సీ,ఎస్టీ సెల్ డైరెక్టర్ డా.మద్దిలేటి, బిసి సెల్ డైరెక్టర్ డా.మిరియాల రమేష్, మైనార్టీ సెల్ డైరెక్టర్ డా.సభినా హెరాల్డ్,ప్రిన్సిపాల్ డా ఆకుల రవి,శ్రీదేవి సైదులు,అనితా,శేఖర్ తదితర అధ్యాపకులు, విద్యార్దిని విద్యార్దులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube