నల్లగొండ జిల్లా: వేములపల్లి మండలం సల్కునూరు గ్రామంలో స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి,ఆండాలు అమ్మవారి కళ్యాణ మహోత్సవం వేద పండితులు యజ్ఞాకుల కమండూరి తిరుమలాచార్యులు, ఘటూరి శ్రీధరాచార్యుల బృందం ఆధ్వర్యంలో ఆదివారం కన్నులపండువగా జరిగింది.
స్వామివారి కల్యాణాన్ని తిలకించేందుకు పరిసర గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై,ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం స్వామివారిని అశ్వవాహనంపై, అమ్మవారిని పల్లకిలో గ్రామసేవకై పుర వీధుల్లో ఊరేగించారు.ప్రతి ఏడాది మాదిరిగానే నీలా భిక్షమయ్య జ్ఞాపకార్థంగా భార్య నీల పాండారమ్మ కుమారుడు నీలా సత్యనారాయణ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.