కేసీఆర్ ముక్కు నేలకు రాసి నల్గొండకు రావాలి:మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

నల్లగొండ జిల్లా:నల్లగొండ జిల్లాకు కేసీఆర్( KCR ) చేసింది ఏమీ లేదని,జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్ అని,నల్లగొండకు రావాలంటే కేసీఆర్ ముక్కు నేలకు రాసి,జిల్లా ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పి ఇక్కడ అడుగు పెట్టాలని రాష్ట్ర రోడ్లు,భవనాలు, సినిమాటోగ్రఫి శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి( Komatireddy Venkat Reddy ) డిమాండ్ చేశారు.ఆదివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్ఎల్బీసీని కుర్చీ వేసుకొని పూర్తి చేస్తానని కేసీఆర్ మాట తప్పాడని, సభలో నల్గొండ ప్రజలకు క్షమాపణ చెప్పాకే కేసీఆర్ ప్రసంగించాలని అన్నారు.

 Komatireddy Venkat Reddy Comments On Kcr, Kcr, Komatireddy Venkat Reddy, Congres-TeluguStop.com

కేసీఆర్ మాట తప్పడంపై నల్గొండ ( Nalgonda )టౌన్ లో సభ రోజు వినూత్న నిరసన చేస్తామని తెలిపారు.కేసీఆర్ కోసం కుర్చీ,పింక్ టవల్ ఎల్ఈడి స్క్రిన్ ను పోలీసు పర్మిషన్ తో ఏర్పాటు చేస్తామని చెప్పారు.

కాళేశ్వరం మేడిగడ్డపై చర్చా వేదికలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.కేఆర్ఎంబి ఫైళ్లపై సంతకం పెట్టిందే కేసీఆర్,హరీష్ రావు అని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఎవరికి లేదన్నారు.

రాష్ట్ర బడ్జెట్ ప్రజా యోగ్యమైందని,ప్రజా పాలనతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళుతుందని స్పష్టం చేశారు.బీఆర్ఎస్ ప్రభుత్వ అప్పులకు కూడా బడ్జెట్ కేటాయించామని తెలిపారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube