నల్లగొండ జిల్లా: తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం( BRS party ) బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధికి వ్యతిరేకంగా పాలన కొనసాగిస్తుందని బీజేపీ జిల్లా మీడియా కన్వీనర్ పాలకూరి రవిగౌడ్( Palakuri Ravi Goud ) విమర్శించారు.సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ బీఆర్ఎస్ పాలనపై ధ్వజమెత్తారు.112 కులాలు వున్న బీసీలలో కేవలం 15 కులాలకే లక్ష రూపాయల సాయం అందిస్తామని చెప్పడం ప్రభుత్వానికి సిగ్గుచేటని,ఆ 15 కులాలకు కూడా ఆ సర్టిఫికెట్లు ఈ సర్టిఫికెట్లు అని గోస పెడుతుందని అన్నారు.
వందల ఎకరాలు వున్న భూస్వాములకు రైతు బంధు( Rythu Bandhu ) ఇచ్చే ముందు వారి కులం సర్టిఫికెట్లు, ఆదాయం సర్టిఫికెట్లు చూపించమని ఎందుకు కోరలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ధనవంతులు మరింత ధనవంతులుగా మారారని పేదవాడు నేడు కూటికి కూడా లేకుండా మిగిలిపోతుండని ఆవేదన వ్యక్తం చేశారు.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వున్న బీసీలలోని అన్ని కుటుంబాలకు ఎలాంటి అప్లికేషన్లు కోరకుండా అందరి బ్యాంక్ ఖాతాలో లక్ష రూపాయల నగదును రైతు బంధు ఏవిధంగా అయితే వేశారో అదే విధంగా లక్ష రూపాయల సాయం బీసీలకు వేయాలని డిమాండ్ చేశారు.