ఎట్టిపరిస్థితుల్లో గ్రానైట్ మైనింగ్ జరగనివ్వను: ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నల్లగొండ జిల్లా: మునుగోడు మండలం గూడెపూరు గ్రామ శివారులో అక్రమంగా ఖమ్మంకు చెందిన బీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యుడికి మైనింగ్ అప్పగించారని,దీంతో ఆ ప్రాంతం కాలుష్యకోరల్లోకి వెళ్లనుందని,ఎట్టిపరిస్థితుల్లోనూ అక్కడ మైనింగ్ జరగనివ్వనని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రజలకు భరోసా ఇచ్చారు.బుధవారం నల్లగొండ జిల్లా కనగల్ మండలంలో పర్యటించిన అనంతరం ఆయన మాట్లాడుతూ బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్ట్ ట్రయల్ రన్ మొదలైందని నెల,రెండు నెలల్లో కాలువలు పూర్తై గంగదేవుని చెరువు పెద్దదేవులపల్లితో పాటు దాదాపు వంద చెరువులతో లక్ష ఎకరాలకు నీళ్లు అందనున్నాయన్నారు.

 I Will Not Allow Granite Mining Under Any Circumstances Mp Komatireddy Venkatare-TeluguStop.com

ఎన్నో ఏళ్లుగా దీనికోసం కొట్లాడుతున్నానని,ఇప్పటికి పూర్తవుతోందని, 23న అక్కడ ప్రోగ్రామ్ ఉంటుంది అందరూ రావాలని అన్నారు.కాలువలు పూర్తయితే గంగదేవుని చెరువు నిండుతుందని,అయితే ఆ ప్రాంతంలో బీఆర్ఎస్ దొంగలు మైనింగ్ కు అనుమతి ఇచ్చారని,

ఈ విషయంపై ఇప్పటికే కలెక్టర్,చీఫ్ సెక్రెటరీతో మాట్లాడానని అన్నారు.

జువ్వలపల్లి,నర్సీపట్నం, గూడెపూరు గ్రామస్తులకు మాట ఇస్తున్నానని ఎట్టి పరిస్థితుల్లో అక్కడ గ్రానైట్ మైనింగ్ జరగనివ్వనని ప్రజలు ఆందోళన పడవద్దన్నారు.ఈ విషయంలో కలిసి పోరాటం చేద్దామని, ఎమ్మెల్యే దగ్గరకు కొందరు మాట్లాడేందుకు వెళ్తే అహంకారంతో మాట్లాడారని,మైనింగ్ వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతాయని, చుట్టుపక్కల ప్రజలు కూడా సమస్యలు ఎదుర్కొంటారని తెలిసి కూడా ఎమ్మెల్యే అహంకారంగా మాట్లాడతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube