నల్లగొండ జిల్లా:తల్లి,చెల్లి,అక్క అనే భేదం లేకుండా మానవత్వం మరిచి,మృగాళ్లలాగా మారి,దారుణంగా వెంబడించి కొట్టి చంపి,సచ్చిన శవాన్ని సైతం రేప్ చేసిన దుర్మార్గుడిని కఠినంగా శిక్షించాలని ఐద్వా కేంద్ర కమిటీ సభ్యురాలు పాలడుగు ప్రభావతి డిమాండ్ చేశారు.బుధవారం ఐద్వా నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడాతూ తుప్రాన్ పేట వద్ద జరిగిన లావణ్య హత్య అత్యంత దారుణమని,శవాన్ని రేప్ చేయడం ఏమి సంస్కృతి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం కంటితుడుపు చర్యలను మానుకొని,ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి తొంభై రోజుల్లో నిందితునికి కఠినంగా శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వానికి చేతకాకపోతే నిందితుడు హరీశ్ గౌడ్ ను ప్రజలకు అప్పగించాలని డిమాండ్ చేశారు.
ఇటీవల భువనగిరి ప్రాంతంలో అత్యంత దారుణాలు జరుగుతున్నాయని రాచకొండ కమీషనరేట్ పని అద్వాన్నంగా ఉందనడానికి ఇదే నిదర్శనమని అన్నారు.పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనపడుతోందని,లావణ్య కుటుంబానికి యాభై లక్షల ఎక్స్గ్రేషియా,ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు.
ఐద్వా ఆధ్వర్యంలో రేపు జిల్లా వ్యాప్తంగా నిరసనలు,దిష్టిబొమ్మల దగ్ధం చేయాలని పిలుపునిచ్చారు.భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు పోలెబోయిన వరలక్ష్మి,రాష్ట్ర కమిటీ సభ్యురాలు కొండా అనురాధా,జిట్టా సరోజా,వాయిదా జానకమ్మ, జిల్లా నాయకురాలు భూతం అరుణ,కుమారి నిలిచి, కారంపూడి ధనలక్ష్మి,చెనబోన నాగమణి, పామనుగుండ్ల జయమ్మ,ఎస్కె సుల్తానా,గోలి వెంకటమ్మ,పద్మ తదితరులు పాల్గొన్నారు.
భూతం అరుణ పట్టణ కార్యదర్శి