నల్లగొండలో దంచి కొడుతున్న ఎండలు

నల్లగొండ జిల్లా:తెలంగాణ రాష్ట్రం( Telangana )లో పగటి ఉష్ణోగ్రత లు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి.వడగాడ్పుల తీవ్రత పెరిగింది.

 Heat Wave Warningin Nalgonda District , Nalgonda District , Heat Wave , Nalg-TeluguStop.com

మరో నాలుగు రోజల పాటు ఇదే విధమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయని వాతవారణ శాఖ అధికారులు వెల్లడించారు.మధ్యాహ్నం 11 నుంచి సాయంత్రం 3గంటల వరకూ చిన్న పిల్లలు,వృద్దులు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచిస్తున్నారు.

వ్యవసాయ రంగంలో ప్రత్యేకించి ఆరుబయట పంట పొలాల్లో పనిచేసే రైతులు,రైతు కూలీలు తగిన జాగ్రత్తలు తీసుకోవలని హెచ్చరిస్తున్నారు.అధిక ఉష్ణోగ్రతలు వేడి గాలుల కారణంగా వడ దెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందని, వ్యవసాయ పనులు ఉదయం 11లోపు ముగించాలని,అదేవిధంగాతిరిగి సాయంత్రం మూడు తర్వాత కొనసాగించుకోవచ్చని సూచిస్తున్నారు.

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బుధవారం ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో నమోదయ్యాయి.

నల్లగొండ జిల్లా( Nalgonda District ) నిడమనూర్‌లో అ త్యధికంగా 43.5డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇదే విధమైన వాతవరణం నెలకొంది.టీక్యాతాండా, ధరూర్‌లో 43.4,పెబ్బేర్‌లో 43.3,నాంపల్లిలో 43.2, కొరటపల్లి,బుగ్గబావిగూడ, తిరుమలగిరి కేంద్రాల్లో 43.1,వడ్డేపల్లిలో 43, కోనైపల్లి,ఇబ్రహింపట్నం, 42.9 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.తెలంగాణ రాష్ట్రంలో కింది స్థాయిలో గాలులు దక్షిణ, ఆగ్నేయ దిశల నుంచి వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం( Hyderabad Meteorological Centre ) వెల్లడించింది.రాగల నాలుగు రో జుల్లో రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2నుండి 3డిగ్రీల వరకూ పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది.

గ్రేటర్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రాగల 24గంట ల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని ఉష్ణోగ్రతలు గరిష్టంగా 39డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube