నల్లగొండ జిల్లా:మునుగోడు ఉప ఎన్నికల రణ రంగం ముగింపు దశకు చేరుకుంది.నవంబర్ 3న పోలింగ్ కు సర్వం సిద్దం చేశారు.
బుధవారం చండూరు డాన్ బాస్కో జూనియర్ కళాశాల లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో పోలింగ్ సిబ్బందికి పోలింగ్ మెటీరియల్ పంపిణీ చేస్తున్నారు.మెటీరియల్ తీసుకొని కేటాయించిన పోలింగ్ స్టేషన్ కు పోలింగ్ సిబ్బంది చేరుకుంటారు.
బుధవారం సాయంత్రం వరకు సిబ్బందిని బూత్ లకు తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి.నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 298 బూత్ లు ఏర్పాటు చేశారు.ఈ ఉప ఎన్నికల్లో 2.41 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.ఎన్నికల బరిలో 47 మంది అభ్యర్థులు ఉండగా,విధుల్లో 1192 మంది సిబ్బంది పాల్గొంటారు.రేపు గురువారం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గం.వరకు పోలింగ్ జరగనుంది.నవంబర్ 6 న ఫలితాలు వెలువనున్నాయి.