గుజరాత్ రాష్ట్రంలో తీగల వంతుల కూలిపోయి వందల కొద్దీ మనుషులు చనిపోయారు.ఊపితేనే పడిపోయేంత నాసిరకంగా ఉన్న తీగల వంతెనలపై నడవాలంటేనే ఇప్పుడు ప్రజలకు వణుకు పుడుతోంది.
ఇలాంటి నేపథ్యంలో కొందరు టూరిస్టులు అందరికీ ఆగ్రహం తెప్పించే ఓ పని చేశారు.అదేంటంటే వారు వేలాడే వంతెన పై ఏకంగా కారునే నడిపారు.
ఆ కారు బరువుకి తీగల వంతెన తెగిపోయి ఉంటే వారి పరిస్థితి ఏమై ఉండేదో ఊహించుకోవడానికే భయం వేస్తోంది.
వివరాల్లోకి వెళితే.
కర్ణాటక రాష్ట్రం, ఉత్తర కన్నడ జిల్లా, యెల్లపురాలో శివపుర అనే ఓ కేబుల్ బ్రిడ్జి ఉంది.కాగా తాజాగా ఈ కేబుల్ బ్రిడ్జిపైకి కొందరు టూరిస్టులు కారును నడిపించారు.
ఇదొక పర్యాటక ప్రాంతం కాగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి తరలి వస్తుంటారు.అయితే ఈ కారును నడిపించిన వారు మహారాష్ట్రకి చెందిన వారిని తెలిసింది.
ఈ టూరిస్టులు సస్పెన్షన్ బ్రిడ్జిపైకి కారును ఎక్కించిన వెంటనే స్థానికులు చాలా ఆందోళన పడ్డారు.అది కూలిపోతే అందరూ చచ్చిపోతారని స్థానికులు వారిని తిడుతూ కారుని అడ్డగించారు.
అయినా కూడా ఆ కారు డ్రైవర్ ముందుకు వెళ్తూనే ఉన్నాడు.
చివరికి స్థానికులు కొట్టేటట్టు మాట్లాడటంతో భయపడిన వారు కారు రివర్స్ లో నడిపించారు.
అదృష్టవశాత్తు ఈ వంతెన ఆ కారు బయటికి వెళ్లేంతవరకు కూలిపోలేదు.దాంతో వారు బతికిపోయారు.
సోషల్ మీడియాలో ఈ టూరిస్టులు చేసిన పిచ్చి పనికి సంబంధించి ఒక వీడియో వైరల్ అయింది.వీడియోలో స్థానికులు కారును వెనక్కి వెళ్ళిపోమని చెప్పడం చూడవచ్చు.
ఆ తర్వాత కారు వెనక్కి వెళ్తుండడం మీరు గమనించవచ్చు.అనంతరం కారుని స్థానికులు వెనక్కి తోశారు.
కారు వెనుక కూడా చాలా మంది ఉన్నారు.
కారు వెనక్కి తోసేప్పుడు బ్రిడ్జి ఊగుతూ కనిపించడంతో గుండె జల్లు ఉన్నదని ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.కొందరు మాత్రం పిచ్చి పట్టిందా అని వారిని తిడుతున్నారు.వీడియో వైరల్ కావడంతో ఈ ఘటనపై పోలీసులు ఒక చేసుకోవడం నమోదు చేశారు.