టాలీవుడ్ లో పలువురు టాప్ కమెడియన్లు ఉన్నారు.వాళ్లు తెర మీద దర్శనం ఇస్తే చాలు జనాల ముఖాల్లో నవ్వులు పూస్తాయి.
సాధారణ నటులుగా సినీ రంగ ప్రవేశం చేసి స్టార్ కమెడియన్లుగా ఎదిగినవారు ఎందరో ఉన్నారు.ఒక్కమాటలో చెప్పాలంటే తెలుగులో ఉన్నంత మంది కమెడియన్లు మరే సినీ పరిశ్రమలో లేరని చెప్పుకోవచ్చు.
వారిలో కొందరు కమెడియన్ల వారసులు ఇండస్ట్రీలో పాతుకుపోగా.మరికొందరు సత్తా చాటలేకపోయారు.హీరోలుగా ప్రయత్నించి సక్సెస్ కాని కమెడియన్ల తనయులు ఎవరో ఇప్పుడు చూద్దాం.
*బ్రహ్మానందం – గౌతమ్
తెలుగు సినిమా పరిశ్రమలో బ్రహ్మానందం గురించి తెలియని వారుండరు.తెలుగు రాష్ట్రాల ప్రజలను తన చక్కటి కామెడీతో కడుపుబ్బా నవ్వించిన హాస్య బ్రహ్మ తను.సినిమా రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకత చాటుకున్నాడు బ్రహ్మానందం.అయితే ఆయన తనయుడు మాత్రం హీరోగా కొన్ని సినిమాలు చేశాడు.పల్లకిలో పెళ్ళికూతురు, వారెవ్వా, బసంతి మూవీస్ లో నటించాడు.
వీటిలో పల్లకిలో పెళ్లి కూతురు మంచి విజయం సాధించగా.మిగతావి ఫ్లాప్ అయ్యాయి.దీంతో ఆయన తెలుగు తెరకు దూరం అయ్యాడు.
*ఎమ్మెస్ నారాయణ – విక్రమ్

బ్రహ్మానందం తర్వాత ఆ రేంజిలో పేరు పోందిన నటుడు ఎమ్మెస్ నారాయణ.ఆయన కొడుకు సైతం హీరోగా ప్రయత్నించాడు.కొడుకు అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు.
కానీ ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది.దీంతో ఆయనకు మరే అవకాశం రాలేదు.చిన్నా చితక పాత్రలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు.
*గౌతం రాజు – కృష్ణ

మరో కమెడియన్ గౌతం రాజు కొడుకు కృష్ణ కూడా సినిమా ప్రవేశం చేశాడు.కృష్ణారావు సూపర్ మార్కెట్ అనే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు.కానీ ఈ సినిమా విజయం సాధించలేదు.దీంతో సినిమాలకు దూరం అయ్యాడు.
*చలపతిరావు – రవిబాబు

సీనియర్ టాలీవుడ్ నటుడు చలపతిరావు తనయుడు రవిబాబు.మల్టీ టాలెంటెడ్ యాక్టర్.ఇతడికి కామెడీ, హార్రర్ మూవీస్ అంటే చాలా ఇష్టం.
నటుడిగా కొనసాగుతూనే దర్శకుడి అవతారం ఎత్తాడు.కేవలం కామెడీ నటుడిగానే ఉంటే బాగుండేది.
కానీ హీరోగా నటించి సక్సెస్ కాలేకపోయాడు.కానీ సినిమా పరిశ్రమలో మంచి గుర్తింపు పొందాడు.
*శివాజీ రాజా – విజయ్ రాజా

అటు మరో కమెడియన్ శివాజీ రాజా కుమారుడు విజయ్ కూడా వెండితెరపైకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు.అందుకోసం గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టాడు.