తగ్గుముఖం పడుతుందనుకున్న కరోనా వైరస్.మళ్లీ సెకెండ్ వైవ్ రూపంలో విజృంభిస్తూ ప్రజలకు, ప్రభుత్వాలకు కంటి మీద కునుకు పట్టనీయకుండా చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే లక్షల మందిని పొట్టన పెట్టుకున్న ఈ మహమ్మారి కోట్ల మందిపై దాడి చేసింది.చేస్తూనే ఉంది.
అయితే అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఎలాగోలా కరోనాను తగ్గించుకున్నా.కొందరిలో నీరసం మాత్రం తగ్గట్లేదు.
దాంతో మునుపటిలా చురుగ్గా, ఉత్సాహంగా ఉండలేకపోతున్నారు.
అయితే అలాంటి వారు కొన్ని టిప్స్ పాటిస్తే.
సులువుగా నీరసాన్ని వదిలించుకోవచ్చు.మరి ఆ టిప్స్ ఏంటో లేట్ చేయకుండా ఓ లుక్కేసేయండి.
నీరసాన్ని తగ్గించడంలో పాలు, ఖర్జూరం కాంబినేషన్ అద్భుతంగా సహాయపడుతుంది.కరోనా తగ్గినా నీరసం తగ్గకుంటే.
ప్రతి రోజు ఒక గ్లాస్ పాలలో నాలుగైదు ఖర్జూరాలను నానబెట్టి తీసుకోవాలి.ఇలా చేస్తే ఎటువంటి నీరసమైనా పరార్ అవుతుంది.
కరోనా తర్వాత నీరసాన్ని తగ్గించుకోవలంటే.కేవలం నీళ్లే కాకుండా పండ్ల రసాలు, కొబ్బరి నీరు, మజ్జగ, సూపులు వంటివి కూడా తరచూ తీసుకోవాలి.అలాగే డైలీ డైట్‌లో బాదం, పిస్తా, వాల్ నట్స్, జీడి పప్పు తదితర నట్స్ ఉండేలా చేసుకోవాలి.ఎందుకంటే, నట్స్ శరీరానికి శక్తిని అందించి నీరసాన్ని దూరం చేస్తాయి.
జామ, ఉసిరి, నిమ్మ, బత్తాయి, దానిమ్మ వంటివి నిత్యం తీసుకోవాలి.వారంలో రెండు, మూడు సార్లు అయినా ఆకుకూరలు తీసుకోవాలి.

ఒక గ్లాస్ నీటిలో అర స్పూన్ చప్పున జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి బాగా మరిగించుకోవాలి.ఇప్పుడు ఈ నీటిని వడబోసి కొద్దిగా తేనె కలిపి సేవించాలి.ఇలా రోజుకు ఒకసారి చేస్తే నీరసం తగ్గు ముఖం పడుతుంది.ఇక కరోనా తగ్గిన వెంటనే కొందరు కఠిణమైన వర్కవుట్స్ చేస్తుంటారు.దాంతో నీరసం మరింత ఎక్కువ అవుతుంది.అందువల్ల, కఠిణమైనవి కాకుండా సులువైన వ్యాయామాలు చేయాలి.
నిద్రను నిర్లక్ష్యం చేసినా నీరసం ఎక్కువ అవుతుంది.కాబట్టి, ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోకుండా హాయిగా నిద్ర పోవాలి.అప్పుడే నీరసం దూరం అవుతుంది.ఇక తీసుకునే భోజనంలో బియ్యమే కాకుండా జొన్నలు, సజ్జలు, రాగులతో తయారు చేసిన రొట్టెలు తీసుకుంటే శరీరానికి బోలెడన్ని పోషకాలు అందుతాయి.
దాంతో నీరసం నుంచి బయటపడతారు.