మహిళలు ప్రధానంగా ఎదుర్కొనే సమస్యల్లో స్ట్రెచ్ మార్క్స్ ఒకటి.ప్రెగ్నెన్సీ మరియు డెలివరీ అనంతరం పొట్టపై స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడడం సర్వసాధారణం.వాటిని అలాగే వదిలేస్తే చాలా అసహ్యంగా కనిపిస్తుంటాయి.అందుకే స్ట్రెచ్ మార్క్స్ ను నివారించుకోవడం కోసం ముప్ప తిప్పలు పడుతుంటారు.కొందరైతే వేలకు వేలు ఖర్చుపెట్టి ట్రీట్మెంట్ కూడా చేయించుకుంటారు.కానీ మన వంటింట్లో ఉండే కొన్ని కొన్ని పదార్థాలతో కూడా వీటిని దూరం చేసుకోవచ్చు.
ముఖ్యంగా ఓట్స్ స్ట్రెచ్ మార్క్స్ ను నివారించడానికి అద్భుతంగా తోడ్పడతాయి.ఓట్స్ ను ఇప్పుడు చెప్పబోయే విధంగా వాడితే కేవలం నెల రోజుల్లో పొట్టపై స్ట్రెచ్ మార్క్స్ మాయం అవుతాయి.
అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక కప్పు వాటర్ వేసుకోవాలి.వాటర్ కాస్త హీట్ అవ్వగానే అందులో రెండు టేబుల్ స్పూన్లు ఓట్స్ వేసి పది నిమిషాల పాటు ఉడికించాలి.

ఇలా ఉడికించిన ఓట్స్ ను పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసి స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ తేనె, వన్ టేబుల్ స్పూన్ ఆముదం, వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని పొట్టపై అప్లై చేసి సున్నితంగా ఐదు నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.
అనంతరం చర్మాన్ని పది నిమిషాలు పాటు ఆరబెట్టుకుని అప్పుడు వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.
రోజుకు ఒకసారి ఈ విధంగా కనుక చేస్తే పొట్టపై ఏర్పడిన స్ట్రెచ్ మార్క్స్ క్రమంగా మాయమవుతాయి.మళ్లీ మీ చర్మం మునుపటిలా స్మూత్ గా అందంగా మారుతుంది.
కాబట్టి స్ట్రెచ్ మార్క్స్ సమస్యతో బాధపడుతున్న వారు ఓట్స్ తో ఇప్పుడు చెప్పిన హోమ్ రెమెడీని తప్పక ట్రై చేయండి.