సాధారణంగా ఒకరు ఎవరినైనా బాగా ఇష్టపడితే లవ్ లేదా మ్యారేజ్ ప్రపోజల్ వారి ముందు ఉంచుతారు.ఇంటెన్స్ ఫీలింగ్స్ తెలియజేయడానికి రింగ్ ఇచ్చి, నీల్ డౌన్ చేసి మరీ ప్రపోజ్ చేస్తారు.
వారికీ ఇష్టముంటే ఎస్ చెప్పి హగ్ చేసుకోవడం, కిస్ చేయడం చేస్తారు.అయితే ఒకరంటే ఒకరికి ఇష్టముండి, ఇద్దరూ ఒకే సమయంలో, ఒకే ప్లేస్ లో ప్రపోజ్ చేయాలని ఆలోచిస్తే? ఇద్దరూ రింగ్స్ కూడా తెస్తే? ఇద్దరూ ఒకేసారి మోకాళ్లపై కూర్చుని తమ ప్రేమను వ్యక్తపరిస్తే? సినిమాల్లో కూడా ఇలాంటి బ్యూటిఫుల్ లవ్ ప్రపోజల్ జరగదేమో కానీ నిజ జీవితంలో మాత్రం జరిగింది.దానికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

వైరల్ వీడియో ప్రకారం, ఇద్దరు లవర్స్ ఒకరికొకరు ఒకే సమయంలో తమ ప్రేమను వ్యక్త పరచాలని భావించారు.కానీ సేమ్ సమయంలో గర్ల్ ఫ్రెండ్( girl friend ) ప్రపోజల్ చేయాలని ప్లాన్ చేసినట్లు బాయ్ ఫ్రెండ్‌కి తెలియదు.అందుకే వారిలో వారే సర్‌ప్రైజ్ అయ్యారు.
ఈ లవర్స్ తమ బెస్ట్ మూమెంట్స్ రికార్డ్ చేయమని మరొక ఫ్రెండ్ కి చెప్పారు.ఆ సమయంలోనే ఈ ట్విస్ట్ బయటపడింది.
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అది చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు.“జీవితంలో వారిద్దరూ అసలైన ప్రేమను కనుగొన్నారు, ఈ వీడియోలో చాలా హ్యాపీనెస్ కనిపిస్తోంది.” అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.వీరిద్దరూ చాలా లక్కీ, సో స్వీట్ కపుల్స్, ట్రూ లవర్స్ అని ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.Karata ట్విట్టర్ పేజీ షేర్ చేసిన ఈ వీడియోకు 60 లక్షల దాకా వ్యూస్ వచ్చాయి.
ఈ బ్యూటిఫుల్ వీడియోను మీరు కూడా చూసేయండి.







