నల్లగొండ జిల్లా:మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో బీజేపీ,కాంగ్రెస్ కార్యకర్తల మధ్య మాటలు కాస్త కొట్లాటకు దారితీశాయి.మంగళవారం మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రచార నిమిత్తం నాంపల్లి మండలం తుంగపాడులో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ,వివిధ పార్టీలోని కార్యకర్తలు బీజేపీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా రాజగోపాల్ ప్రసంగించే సమయంలో కొందరు కాంగ్రెస్ నేతలు ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు.దీనితో రాజగోపాల్ రెడ్డి కల్పించుకొని మొరిగే కుక్కల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అనడంతో ఒక్కసారిగా కాంగ్రేస్ రెచ్చిపోయారు.
రాజగోపాల్ రెడ్డితో వాగ్వాదానికి దిగారు.ఈ నేపథ్యంలో బీజేపీ,కాంగ్రేస్ నాయకులు, కార్యకర్తలు ఒకరిపై ఒకరు తోసుకుంటూ కొట్టుకున్నట్లు సమాచారం.