నల్లగొండ జిల్లా: నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న రాష్ట్ర సర్కార్ కు పాలించే అర్హత లేదని,కేసీఆర్ ముఖ్యమంత్రి పదవికి తక్షణమే రాజీనామా చేయాలని చండూరు మాజీ ఎంపీటీసీ నేర్లకంటి రవికుమార్ డిమాండ్ చేశారు.టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు ఆదివారం మునుగోడు నియోజకవర్గ పరిధిలోని చండూరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్దం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిఎస్పిఎస్సి పేపర్ లీకేజీ ఘటనకు సంబంధించి టిఎస్పిఎస్సి చైర్మన్ జనార్దన్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేసి,
అరెస్ట్ చేయాలని,సీబీఐ చేత మరింత లోతుగా ఎంక్వయిరీ చేయిచి, ఇందులోని పాత్రధారులు, సూత్రధారులు ఎవ్వరినీ వదలకుండా ప్రతి ఒక్కరిని కఠినంగా శిక్షించాలన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అనంత నర్సింహా,వడ్డేపల్లి భాస్కర్, గండూరి నర్సింహా,కర్ణాటక శ్రీను,రాపోలు వెంకటేశం, దేవా,ఆవుల అశోక్, చొప్పరి రాజు,శివ, బూషిపాక శంకర్, బొమ్మకంటి శేఖర్, ఇడికూడ నరేందర్, గంటేకంపు అశోక్ తదితరులు పాల్గొన్నారు.