ప్రభుత్వాలకు ఉచితాలపై ఉన్న శ్రద్ధ ఉచిత చదువుపై లేకపోయే...!

నల్లగొండ జిల్లా:రాజకీయ పార్టీలకు,అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలకు ఉచిత పథకాలపై ఉన్న శ్రద్ధ ఉచిత చదువులపైలేకపోవడం విచారకరమని ప్రభుత్వ టీచర్ పాక లింగమల్లు యాదవ్ అన్నారు.నల్లగొండ జిల్లా( Nalgonda District ) పీఏ పల్లి మండలం మల్లాపురం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న ఆయన మాట్లాడుతూ ఫ్రీ బస్సుపై ఉన్న నమ్మకం ఫ్రీ స్కూల్స్ పైన లేకపోవడం అంటే 100% ప్రభుత్వ టీచర్స్ పై నమ్మకం లేకపోవడమేనని తెలిపారు.

 If The Government's Focus On Free Bus Is Not On Free Education. Nalgonda Distric-TeluguStop.com

దీనికి ప్రధాన కారణం ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ పిల్లలను సర్కార్ బడిలో చదించక పోవడమేనని, ప్రజల నుండి జీతాలు తీసుకుంటూ కార్పొరేట్ స్కూల్స్( Corporate Schools ) లో పిల్లలను చదివిస్తే తల్లిదండ్రులు మనం చదువు చెప్పే సర్కార్ బడికి పిల్లలను ఎలా పంపుతారని ప్రశ్నించారు.

తమ ఇద్దరు పిల్లలు పాక విక్రాంత్ యాదవ్,పాక జైతు యాదవ్ తను పాఠాలు చెప్పే బడిలోనే చదివిస్తూ టీచర్ పాక లింగమల్లు యాదవ్ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివించకపోతే మొత్తం ప్రభుత్వ విద్యా వ్యవస్థ ప్రైవేటికరణకు గురయ్యే ప్రమాదం ఎంతో దూరంలో లేదని హెచ్చరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube