నల్లగొండ జిల్లా:తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ చేపట్టిన ఫంక్షనల్ వర్టికల్స్ పటిష్ఠంగా అమలు అయ్యేలా చూడలని మరియు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుంటూ నేర విచారణలో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా కన్విక్షన్ రేటు పెంచాలని, జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో పెండింగ్ కేసుల లేకుండా చూడాలని,అవసరమైతే అన్ని రకాల చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ పికే అపూర్వరావు అదేశించారు.ఆదివారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన నేర సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ గత నెలలో జరిగిన నేరాలపై చర్చించి పెండింగ్ కేసులను త్వరితంగా పరిష్కరిస్తూ పెండింగ్ కేసుల సంఖ్యను తగించడానికి చర్యలు తీసుకోని,దీర్ఘ కాలికంగా పెండింగ్ లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే వాటిని పరిష్కరిస్తూ కేసుల సంఖ్య తగుంచడానికి చర్యలు తీసుకోవాలన్నారు.
పెండింగ్ కేసుల విషయంలో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, కొత్త కేసులతో పాటు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న కేసులను ఎప్పటి కప్పుడు సమీక్షించడం ద్వారా కేసుల సంఖ్య తగ్గే దిశగా అన్ని స్థాయిల అధికారులు పనిచేయాలన్నారు.నేర నియంత్రణలో భాగంగా సొసైటి ఫర్ పబ్లిక్ సెప్టిలో భాగంగా ప్రతి పట్టణాల్లో,కాలనీలో, గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా ప్రజలకు,వ్యాపారులకు అవగాహన కల్పించాలన్నారు.
ఇసుక అక్రమ రవాణా అరికట్టాలని,ప్రమాద నివారణ కొరకు రోడ్ భద్రత అవసరాలు నిర్వహించాలని పీడీఎస్ బియ్యం అక్రమ నిల్వలను అరికట్టాలని,అక్రమ గంజాయి రవాణ,పేకాట, మట్కలను అరికట్టలన్నారు.
దొంగతనాలు జరగకుండా రాత్రి పూట గస్తీ బీట్ లు, పెట్రోలింగ్ నిర్వహించాలని 100 కాల్ వెంటనే స్పందించి ఆపదలో ఉన్నవారికి తక్షణ సహాయం అందించాలని అన్నారు.
విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన సిబ్బందిని అధికారులు గుర్తించి ప్రతి నెల అధికారులను సిబ్బందిని ప్రోస్తహించే విధంగా రివార్డులు,అవార్డులు ఇవ్వడం జరుగుతుందన్నారు.ప్రతి ఒక్కరూ ప్రజల కోసం అంకిత భావంతో అందుబాటులో ఉండాలని సూచించారు.
జిల్లాలో ప్రతిభ కనబర్చిన 25 మంది సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో ప్రొబేషనరీ ఐపిఎస్ శేషాద్రి రెడ్డి,అడిషనల్ ఎస్పీ కేఆర్కే రావు,డిస్పిలు నర్సింహా రెడ్డి,వెంకటగిరి, నాగేశ్వరరావు,రమేష్,సిఐ మరియు ఎస్ఐలు పాల్గొన్నారు
.