నల్లగొండ జిల్లా:గిరిజన సహకార అభివుద్ధి కార్పోరేషన్ చైర్మన్,రాష్ట్ర ఎస్టీ సెల్ చైర్మన్ తేజావత్ బెల్లయ్య నాయక్ అధ్యక్షతన నాగార్జున సాగర్ లో ఈ నెల 5నుంచి 11వ వరకు జరిగే అఖిల భారత గిరిజన ఆదివాసీ కాంగ్రెస్ ప్రతినిధుల శిక్షణా తరగతులను జయప్రదం చేయాలని కాంగ్రెస్ ఎస్టీ సెల్ నియోజక వర్గ అధ్యక్షుడు సపావత్ పాండు నాయక్ పిలుపు నిచ్చారు.శనివారం నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ లో జరగనున్న సభ స్థలి ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ శిక్షణా తరగతులకు ముఖ్యఅతిధిగా రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్,రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి, ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యేలు జయవీర్ రెడ్డి,బాలూ నాయక్,డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్,మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ లింగారెడ్డి హజరు కానున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఎస్టీ సెల్ అధ్యక్షుడు కేతావత్ నాగేశ్వర్,మండల అధ్యక్షులు నాగేందర్ నాయక్,బాలు నాయక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కృష్ణ నాయక్, ఉపాధ్యక్షుడు లాలు, ముని,శౌరి తదితరులు పాల్గొన్నారు.