నల్గొండ జిల్లా: నల్గొండలో ఈనెల 13న బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభకు ప్రస్తుతం జిల్లాలో అమలులో ఉన్న 30, 30A పోలీస్ యాక్ట్ అడ్డంకిగా మారనుందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.ఈ యాక్ట్ అమలులో ఉన్నప్పుడు సభలు,ర్యాలీలు,ధర్నాలు, రాస్తారోకోలు పబ్లిక్ మీటింగ్ లకు అనుమతి లేదని చెబుతున్నారు.
బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ నిర్వహణకు 30 30 A పోలీసు యాక్ట్ అడ్డంకిగా మారితే ఇప్పటికే నియోజకవర్గాల వారీగా జన సమీకరణకు సంబంధించి సమన్వయకర్తల నియామకం కూడా చేసిన గులాబీ పార్టీ నల్గొండ పట్టణ సమీపంలో బహిరంగ సభకు ఏర్పాట్లు కూడా చేస్తుంది.అయితే ఒకవేళ పోలీసులు సభకు అనుమతి నిరాకరిస్తే అనుమతి కోసం కోర్టుకు వెళ్లే ఆలోచనలో బీఆర్ఎస్ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది.







