నల్లగొండ జిల్లా:చండూరు మండలం( Chandur Mandal ) అంగడిపేట గ్రామంలోని 5వ వార్డులో గుంతను తవ్వి యాది మరవడంతో ప్రమాదాలకు నిలయంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చండూరు,మర్రిగూడ రోడ్డు పక్కన మిషన్ భగీరథ( Mission Bhagiratha ) మెయిన్ వాల్ కోసం తీసిన గుంతను పూడ్చకుండా వదిలేశారని,చండూరు రెవిన్యూ డివిజన్, మున్సిపాలిటీ కావడంతో నిత్యం వందలాది మంది వాహనదారులు ఈ దారి గుండానే ప్రయాణిస్తుంటారని,రాత్రి సమయాల్లో ద్విచక్ర వాహనదారులు,బాటసారులు ప్రమాదాల బారిన పడ్డారని వాపోతున్నారు.
నెలలు గడుస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే గుంతను పూడ్చి ప్రమాదాల బారిన పడకుండా చూడాలని గ్రామస్తులు,ద్విచక్ర వాహనదారులు,బాటసారులు కోరుతున్నారు.