లీడర్ దోస్తీ-క్యాడర్ కుస్తీ

నల్లగొండ జిల్లా:అధికార టిఆర్ఎస్ తో వామపక్ష పార్టీల పొత్తు నిర్ణయంపై సర్వత్రా ఆక్టికరమైన చర్చ జరుగుతోంది.మునుగోడు పొత్తు వామపక్షాలను మరింతగా ముంచుతుందని,పొత్తుకన్నా పోరాడితేనే బాగుండేదంటున్న క్యాడర్,కానీ,ఇప్పటికే కమిట్ అయిన లీడర్.

 Leader Dosti-cadre Wrestling-TeluguStop.com

ఎన్నికలు రాగానే ఎవరినో ఒకరిని ఓడించడానికి మరెవరో ఒకరితో పొత్తు పెట్టుకోవడం ప్రజలకు ఎలాంటి సంకేతాలు ఇస్తుందో,భవిష్యత్ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఆలోచించాలంటున్న పార్టీల శ్రేణులు.హక్కుల పోరాటాలను,ప్రజాఉద్యమాలను,భూపోరాటాలను తీవ్రంగా అణిచివేస్తూ వామపక్షపార్టీల కార్యక్రమాలను, కార్యకర్తలను కట్టడిచేస్తున్న పాలక పార్టీతో పొత్తు పెట్టుకునే ముందు పోడుభూముల సమస్య, భూపోరాటాలు,దళితులకు మూడు ఎకరాల భూమి, డబుల్ బెడ్ రూం ఇండ్లు,ఇంటికో ఉద్యోగం ఇలాంటి కొన్ని అంశాల పైనైనా ముఖ్యమంత్రి కేసీఆర్ చేత సానుకూల ప్రకటన చేయించి దోస్తీ చేస్తే బాగుండేదని మరికొందరి అభిప్రాయంగా ఉంది.

వామపక్షపార్టీలకు బలమైన పట్టున్న మునుగోడునే వదిలేస్తే ఇక మిగతా నియోజకవర్గాల్లో మనగోడు ఎవరు వింటారనేది క్యాడర్ ను తొలుస్తున్న ప్రశ్న.బిజెపిని ఓడించేందుకే టిఆర్ఎస్ తో పొత్తంటూ ఏకవాక్య సమాధానం ఇస్తున్న సిపిఎం,సిపిఐ లీడర్.

ఈ కలయికతో ఎర్ర గులాబీ వికసిస్తుందా? లేక గులాబీ వికసించడానికి ఎరుపు ఎరువుగా మారుతుందా కాలమే సమాధానం చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube