నల్లగొండ జిల్లా: రంగుల కేళి రంగోలి (హోలీ) పండుగను ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా కులమతాలకు అతీతంగా చిన్నా పెద్దా తేడా లేకుండా రంగులు చల్లుకుంటూ కేరింతల నడుమ జరుపుకున్నారు.
ప్రజలంతా రకరకాల రంగులతో జరుపుకునే ఈ హోలీ పండుగ సంబరాలు చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా భావిస్తారు.
దీనిని వసంత పంచమి అని కూడా అంటారు.