డిస్ట్రిక్ట్ డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో గంజాయి దగ్దం:ఎస్పీ చందనా దీప్తి

నల్లగొండ జిల్లా:మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా అక్రమ గంజాయి రవాణాపై జిల్లా పోలీసుల ఉక్కుపాదం మోపి, గంజాయి నివారణపై నిరంతర నిఘా పెడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో 26 కేసులో సీజ్ చేసిన కోటి 93 లక్షల విలువ గల 1379 కేజీల గంజాయిని కోర్టు ఉత్తర్వుల ప్రకారం జనావాసాలకి దూరంగా నార్కట్ పల్లి మండలం గుమ్మలబావి పోలీస్ ఫైరింగ్ రేంజ్ నందు శనివారం జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ అధ్వర్యంలో నిర్వీర్యం చేశామని నల్లగొండ జిల్లా ఎస్పీ చందనా దీప్తి తెలిపారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని,ఎవరైనా అక్రమ గంజాయి రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని,జిల్లా పోలీసులు నిరంతరం నిఘా ఉంటుందన్నారు.

 Ganjai Dagdam Sp Chandana Deepthi Under District Drug Disposal Committee , Drug-TeluguStop.com

ఈకార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాములు నాయక్,ఎస్బీడి ఎస్పీ రమేష్, నల్లగొండ డిఎస్పీ శివరాంరెడ్డి, డి.సి.ఆర్.బి డిఎస్పీ సైదా, సీఐలు రాఘవరావు,బీసన్న, సైదులు,నాగరాజు,ఆర్ఐలు సురాప్ప నాయుడు,సంతోష్, ఎస్ఐ అంతిరెడ్డి పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube