నల్లగొండ జిల్లా:గుర్రంపోడు మండలం( Gurrampode ) కొప్పోల్ గ్రామంలో చినుకు పడితే చాలు రోడ్లన్నీ చిత్తడిగా మారి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.మెయిన్ బజార్లో వర్షం పడితే రోడ్డంతా నీరు నిలిచి బురదమయంగా మారుతుందని,అలాగే రామాలయం నుండి బుడ్డారెడ్డిగూడెం రోడ్డు వరకు గతంలో వేసిన సీసీ రోడ్డు మొత్తం ధ్వంసమై అద్వాన్నంగా తయారైందని గ్రామస్తులు వాపోతున్నారు.
వర్షంపడి రోడ్డుపై గుంతల్లో నీళ్ళు నిలిచి,ఎక్కడ గుంత ఉందో అర్ధంకాక ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రాబోయే వర్షా కాలాన్ని దృష్టిలో ఉంచుకుని,ఇప్పటికైనా గ్రామంలోని పాత సీసీ రోడ్ల స్థానంలో కొత్తగా సీసీ రోడ్లు నిర్మించాలని కోరుతున్నారు.