నల్లగొండ జిల్లా:తెలంగాణ ప్రభుత్వం వృద్దులు, వికలాంగులు,ఒంటరి స్త్రీలు,వితంతువులకు,వివిధ వృత్తుల వారికి చేయూతగా ఆసరా పథకంలో భాగంగా రూ.4016,రూ.2016 పింఛన్ అందజేస్తున్న విషయం తెలిసిందే.ఈ పెన్షన్ల పై ఆధారపడి జీవించే నిస్సహాయుల చేయూతలో పోస్ట్ నిడమనూరు మాస్టర్లు కమిషన్ల కక్కుర్తికి పాల్పడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ప్రభుత్వం ఇచ్చే పెన్షన్లో చిల్లర రూ.16 పంపిణిదారులకు ప్రతినెలా ఇవ్వకుండా వేల రూపాయలు మింగేస్తున్నారని వాపోతున్నారు.ఎవరైనా అడిగితే చిల్లర లేవని రూ.500 చిల్లర తీసుకొని రావాలని దబాయించడంతో చేసేదేమీ లేక వెనుదిరుగుతున్నట్లు చెబుతున్నారు.ఈ విషయంపై ఉన్నతాధికారులు చొరవ తీసుకొని ఇప్పటి వరకు నొక్కేసిన రూ.16 తిరిగి చెల్లించేలా,ఇకపై ఇలాంటి దోపిడీకి పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Latest Nalgonda News