పొలిటికల్ హీట్ పెంచుతున్న మునుగోడు

నల్లగొండ జిల్లా:కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన రాజీనామా ఆమోదించుకున్న నాటి నుండి మునుగోడు రాజకీయాలు మొత్తం మారిపోయాయి.అటు అధికార టీఆర్ఎస్ పార్టీ ఇటు కాంగ్రెస్,బీజేపీల మధ్య త్రిముఖ పోరు నెలకొంది.

 Antecedents Of Increasing Political Heat-TeluguStop.com

ఎవరికి వారు తమతమ ఎత్తుగడలు,వ్యూహలతో గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నారు.ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీ 6 మండలాల్లో ఒక మండలానికి ఇద్దరు ఎమ్మెల్యేలను ఇంచార్జ్ లుగా నియమించినది.

అందులో భాగంగా ఇంచార్జ్ లుగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్న కాంగ్రెస్ సర్పంచ్,ఎంపీటీసీ,లీడర్ లను తమ పార్టీలకు లాగడంలో పడ్డారు.అందులో భాగంగా ఇప్పటికే చాలా మండలాలో చాలా మంది ప్రజా ప్రతినిధులను తమ పార్టీలో చేర్చుకున్నారు.

ఈ ఉప ఎన్నికలో జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్య భూమిక పోషిస్తున్నాడు.ఈ నెల 20 న మునుగోడు హెడ్ క్వార్టర్ లో 20 ఎకరాలలో భారి బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు.

దానికి గాను అన్ని ఏర్పాట్లను పూర్తి చేసే పనిలో ఉన్నారు అధికార పార్టీ నాయకులు.ఇక బీజేపీ పార్టీ నుండి పోటి చేయబోతున్న రాజగోపాల్ రెడ్డి కూడా మునుగోడు ప్రజలు నావైపే ఉంటారన్న ధీమాను వ్యక్తం చేస్తున్నాడు.

నా రాజీనామాతో ఇప్పటికే 210 కోట్లు కెసిఆర్ విడుదల చేశారని,గతంలో అసెంబ్లీ సాక్షిగా ఎన్ని సమస్యలు లేవనెత్తినా పట్టించుకోని ప్రభుత్వం నేడు నా రాజీనామాతో నియోజకవర్గంలో నిధులు వరదల్లా పారుతున్నాయని,రాజీనామా చేయకపోతే ఈ అభివృద్ధి జరుగేదా అని ప్రతీ సందర్భంలో చెప్పుకుంటున్నారు.ఇప్పటి వరకు బీజేపీ అగ్ర నాయకులు ఎవ్వరు ఇంతవరకు మునుగోడులో అడుగు పెట్టలేదు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పాదయాత్ర మూడో విడతలో భాగంగా చౌటుప్పల్ టచ్ చేస్తూ వెళ్ళింది.రాజగోపాల్ రెడ్డి కూడా పాదయాత్రలో సంజయ్ ని కలిసి పలు విషయాలపై చర్చించారు.

ఈ నెల 21 న జరిగే భారీ బహిరంగ పనులపై కూడా సమాలోచనలు చేశారు.ఈ సభ 25 ఎకరాల విస్తీర్ణంలో లక్ష మంది ప్రజలు హాజరయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ బహిరంగ సభలోనే రాజగోపాల్ కాషాయ కండువా కప్పుకొనున్నాడు.తాను బీజేపీలో చేరిన వెంటనే మునుగోడు నియోజకవర్గానికి కమిటీలను ఏర్పాటు చేసి యుద్ద ప్రత్తిపాధికన ప్రచారం చేయాలని భావిస్తుంది.

ఇప్పటికే చేరికల కమిటీ ఇంచార్జిగా వ్యవహారిస్తున్న ఈటెల రాజేందర్ నియోజకవర్గంలో అడుగు పెట్టకుండానే అధికార పార్టీ నుండి ప్రజాప్రతినిధులను లాగే పనిలో బిజీగా ఉన్నారు.ఈ సభ అయిపోయిన వెంటనే బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ ఇక్కడే మకాం వేసే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది,20 తారీకు కేసీఆర్ సభ,21 న అమిత్ షా సభకి జనాలను ఎలా పోగుచేయాలో ఆయా పార్టీల్లో తర్జనభర్జనలు జరుగుతున్నాయి.

బీజేపీలో ఇప్పుడు ఉన్న నాయకులు,రాజ్ గోపాల్ రెడ్డితో వెళ్లే నాయకులు ఎలా సమన్వయం చేస్కుంటూ వెళ్తారో చూడాలి మరి.ఈ రెండు పార్టీల పరిస్థితి ఇలా ఉంటే అటు కాంగ్రెస్ పని బయటికి చెప్పలేకుండా ఉంది,రాజ్ గోపాల్ రెడ్డి రాజీనామా చేసిన రెండు రోజుల్లోనే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి తమ బల నిరూపణ చేశారు.అప్పటినుండి ఇప్పటి వరకు మళ్ళీ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి అడుగు పెట్టలేదు,అజాది కా గౌరవ్ యాత్ర పేరున నారాయణపురం నుండి చౌటుప్పల్ వరకు నిర్వహించిన పాదయాత్రకు ముఖ్య అతిధిగా రేవంత్ రెడ్డి హాజరు కావాల్సి ఉంది.కానీ,అతను హాజరు కాకపోవడం వల్ల కేంద్రం కాంగ్రెస్ నుండి ఏమైనా రాజకీయ కారణాలు ఉన్నాయా అని చర్చ జరుగుతుంది.

చండూర్ సభలో అద్దంకి దయాకర్ వెంకట్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు వెంకట్ రెడ్డి నేను ప్రచారానికి రానని చెప్పడం,టికెట్ రేస్ లో ఆశవాహులు కూడా ఎక్కువగా ఉండడంతో కార్యకర్తలలో గందరగోళంలో ఉన్నట్లు తెలుస్తుంది.కాంగ్రెస్ పార్టీలో గెలిచిన సర్పంచ్ లు అటు టీఆర్ఎస్ ఇటు బీజేపీకిలోకి వెళ్లడంతో అయోమయంలో ఉన్నారు.

మునుగోడు కాంగ్రెస్ క్యాడర్ టీఆర్ఎస్,బీజేపీ పెట్టె ప్రలోభాలకు బెండ్ అవుతున్నట్లే కనిపిస్తుంది.ఇప్పుడు మునుగోడు మూడు పార్టీల రాజకీయ చదరంగంలో ప్రజలు పావులుగా మారడంతో మునుగోడులో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా హీటెక్కింది.

రెండు రోజుల్లోనే అటు ముఖ్యమంత్రి మీటింగ్,ఇటు కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా మీటింగ్ ఉండడంతో అటు ప్రజలను మీటింగ్ లకు తరలించే పనిలో ఇటు ఆయా పార్టీల కార్యకర్తలు,లీడర్లు బిజీబిజీగా ఉన్నారు.అన్ని పార్టీల నుండి వివిధ ప్రాంతాల నుండి తమ తమ పార్టీల కోసం పనిచేసే లీడర్,క్యాడర్ 3,4 నెలలు ఇక్కడే ఉంటుండంతో రెంట్ కి ఎక్కడా ఇల్లు దొరకని పరిస్థితి నియోజకవర్గంలో నెలకొంది.

దొరికిన ఇల్లు,ఆఫీస్ ల కోసం రెంట్లు కూడా 7 వేల నుండి పది వేల వరకు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది.మొత్తం మీద ఉప ఎన్నిక పుణ్యమా అని మునుగోడు రాష్ట్రంలో ఓ ప్రత్యేక నియోజకవర్గంగా గుర్తించబడడమేనా ప్రజలకు ఏమైనా జరిగే అవకాశం ఉన్నదా అనేది ప్రధాన అంశంగా చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube