నల్లగొండ జిల్లా: మునుగోడు నియోజకవర్గ( Munugodu ) కేంద్రంలో ఆర్డీవో మరియు మున్సిపల్ ఆఫీసులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూభారతీయ ప్రజా పార్టీ జాతీయ అధ్యక్షుడు మాదగోని వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సోమవారం నుండి రిలే నిరాహారదీక్షలు చేపట్టారు.
ఈ దీక్షలకు డోలు దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు మల్గి యాదయ్య,బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మాదగోని నరేందర్ గౌడ్,స్థానిక సర్పంచ్ మిర్యాల వెంకన్న, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు బొల్గురి రమేష్,బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు అక్కెనపల్లి సతీష్ కుమార్( Satish Kumar ) తదితరులు దీక్షలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ చండూరు మున్సిపాలిటీగా,రెవిన్యూ డివిజన్ గా,మార్కెట్ యార్డ్ కలిగి ఉందని, ఆర్డీవో,మున్సిపల్ కార్యాలయాలు అక్కడే ఉండడం వల్ల నియోజకవర్గ కేంద్రంగా ఉన్న మునుగోడు ఇంకా వెనుకబడి పోయిందని, మునుగోడును రెవిన్యూ డివిజన్ గా ఏర్పాటు చేసి, అన్ని ప్రభుత్వ కార్యాలయాలుమునుగోడులోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.మునుగోడు ప్రజల ఆకాంక్ష నెరవేరే వరకు ఈ రిలే నిరాహారదీక్షలు కొనసాగుతాయని ప్రకటించారు.