ఈ మధ్యకాలంలో చాలా మంది ప్రజలు కాస్త ఆరోగ్యం పై శ్రద్ధ చూపుతున్నారు అని ఖచ్చితంగా చెప్పవచ్చు.మరి ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి సరైన పౌష్టికాహారం కచ్చితంగా ఉండాలి.
అన్ని రకాల పోషకాలు కలిగిన ఆహారం శరీరానికి తగిన మోతాదులో అందడం వల్ల మనం ఆరోగ్యంగా ఉండవచ్చు.అంతేకాకుండా శరీరానికి ప్రోబయోటిక్స్ అందడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది.
అసలు బయోటిక్స్ అంటే ఏమిటి, వాటి ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.మన శరీరంలో జరిగే అనేక రకాల ప్రక్రియలు మన ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉంటాయి.
ఆరోగ్యాన్ని కాపాడడానికి శరీరానికి తగిన పౌష్టిక ఆహారం కచ్చితంగా ఉండాలి.అయితే మన శరీరంలో కొన్ని కోట్ల సూక్ష్మజీవులు నివాసం ఉంటాయి.
అయితే సూక్ష్మజీవులలో కొన్నిటిని ప్రోబయోటిక్స్ అని పిలుస్తారు.శరీరంలో కోట్ల సూక్ష్మజీవుల్లో బ్యాక్టీరియాలు కూడా ఉంటాయి.
మళ్ళీ వాటిలో శరీరానికి మేలు చేసే బ్యాక్టీరియాలతో పాటు కీడు చేసే బ్యాక్టీరియాలను కూడా ఉంటాయి.
ఇలా మన శరీరానికి మేలు చేసే బ్యాక్టీరియాలను వైద్య బాషలో అప్రో బయోటిక్స్ అని పిలుస్తారు.వీటి వల్ల మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.మరీ ముఖ్యంగా చెప్పాలంటే జీర్ణాశయం, ప్రేగులలో ఈ ప్రోబయోటిక్స్ నివసిస్తూ ఉంటాయి.
ఇవి జీర్ణ క్రియను సక్రమంగా ఉండేలా చేస్తాయి.అయితే ఈ ప్రోబయోటిక్స్ మనం తీసుకునే ఆహారం ద్వారా శరీరంలోకి చేరుతాయి.
పులియపెట్టిన ఆహారంలో ఎక్కువగా లభించే ప్రోబయోటిక్స్ ప్రేగుల ఆరోగ్యాన్ని కాపాడడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి.కడుపునొప్పి, విరోచనాలు లాంటి సమస్యలతో బాధపడే వారికి వైద్యులు ప్రోబయోటిక్స్ కలిగిన ఔషధాలను ఇస్తూ ఉంటారు.
ముఖ్యంగా చెప్పాలంటే పిల్లలకు ఐస్ క్రీములు, చాక్లెట్ల కన్నా యోగాట్ ఇవ్వడం ద్వారా అది వారి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.అలాగే పులియ పెట్టే ప్రక్రియ ద్వారా తయారు చేసే ఇడ్లీ, దోశ, ఉత్తపం లాంటి ఆహారం తినడం వల్ల కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు.