నామ్ ఎక్సప్రెస్ వే చెరువులను తలపిస్తుంది...!

నల్లగొండ జిల్లా:నార్కట్ పల్లి, అద్దంకి మేదరమెట్ల నామ్ ఎక్స్ ప్రెస్ వే పై మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో ఎక్కడ చూసినా చెరువులను తలపించేలా వర్షపు నీరు దర్శనమిస్తుందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.చిన్నపాటి వర్షానికే రోడ్డుపై నీళ్ళు నిలిచి వాహనదారులకు,పాదచారులకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తుందని వాపోతున్నారు.

 The Nam Expressway Overlooks The Ponds , Nam Express Way, Madugulapally Toll-TeluguStop.com

ఈ రోడ్డు నిర్మాణంలో అధికారుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుందని,మాడుగులపల్లి మండల కేంద్రం,మిర్యాలగూడ ఫ్లై ఓవర్ వద్ద వర్షపు నీరు రాకపోకలకు ఇబ్బందిగా మారిందని అంటున్నారు.ఇదే విషయమై మాడుగులపల్లి టోల్ సిబ్బందిని ఫోన్లో వివరణ కోరగా మాకు ఎలాంటి సంబంధం లేదని,గ్రామస్తులకు తెలియజేయాలని పొంతనలేని సమాధానాలు చెబుతున్నారని ఆరోపిస్తున్నారు.

రానున్న రోజుల్లో వర్షం ఎక్కువగా కురిసే అవకాశం ఉన్నందున టోల్ సిబ్బంది స్పందించి తగు చర్యలు తీసుకోవాలని, అప్పటివరకు మాడుగులపల్లి టోల్గేట్ వద్ద ఎలాంటి రుసుము వసూలు చేయరాదని ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube