యాదాద్రి భువనగిరి జిల్లా:జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజుల నియంత్రణ కోసం “జిల్లా ఫీజుల రెగ్యులేటరీ కమిటీ” ఏర్పాటు చేయాలని ఆల్ ఇండియా పేరెంట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కొడారి వెంకటేష్ డిమాండ్ చేశారు.ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ హనుమంతు కే.
జండగే కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న పలు ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని,దీంతో తల్లిదండ్రులు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారని,ఫీజుల నియంత్రణ కోసం జిల్లాలోని విద్యాశాఖాధికారి,ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, తల్లిదండ్రులు,విద్యార్థి సంఘాలు,జర్నలిస్టులు,స్వచ్చంద సంస్థల ప్రతినిధులతో “జిల్లా ఫీజుల రెగ్యులేటరీ కమిటీ” ఏర్పాటు చేయాలని కోరారు.