నల్లగొండ జిల్లా:నకిరేకల్ పట్టణంలో ఏఐటియుసి ఆధ్వర్యంలో హమాలీ యూనియన్ కార్మికులు చేస్తున్న సమ్మె బుధవారం రెండో రోజుకు చేరింది.ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి, సివిల్ సప్లై హమాలీ వర్కర్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు పల్లా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా పంపిణీ పథకంలో హమాలీలుగా పనిచేస్తున్న కార్మికులు 40 ఏళ్ల నుండి ప్రజా పంపిణీ పథకాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ తమ వీపులపై క్వింటాల కొద్ది బరువులు మోస్తూ 187 మండల పాయింట్లలో ఎగుమతి దిగుమతి చేస్తున్నారని, ప్రభుత్వం సివిల్ సప్లై హమాలీలను కార్మికులుగా గుర్తించకుండా శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వ ఇచ్చిన హామీలు నిలుపుకునేందుకు నిరసనగా అనేక పోరాటాల ఉద్యమాల తర్వాత ప్రభుత్వ యూనిట్లతో చేసుకున్న ఒప్పంద ప్రకారం ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి హమాలీ రేట్లు పెంచి అమలు చేస్తామని అంగీకరించి అమలు చేయకుండా దాటవేయడాన్ని,రాష్ట్రంలో 3600 హమాలీలు 160 మంది మహిళా కార్మికులు మండల పాయింట్లలో పనిచేస్తున్న వారికి ప్రభుత్వం జనవరి 2024 నుండి హమాలీ రేట్లు పెంచి అమలు చేస్తామని కమిషనర్ సమక్షంలో జరిగిన చర్చలతో ప్రతి క్వింటాల్ ఎగుమతి దిగుమతి రూ.29 చెల్లిస్తామని అక్టోబర్ 4 2024 ఒప్పందం జరిగినా జీవో విడుదల చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేయడాన్ని తప్పుపట్టారు.డిసెంబర్ 18న వందలాది హమాలీలు సివిల్ సప్లై కార్యాలయాన్ని ముట్టడించారని వెంటనే జీవో విడుదల చేసి హమాలి రేట్లు బకాయిలతో సహా చెల్లించాలని,31 లోపు జీవో విడుదల చేయాలని, బకాయిలు చెల్లించాలని లేకుంటే జనవరి ఒకటి 2025 నుండి నిరవధిక సమ్మె చేస్తామని,సమ్మె నోటీసు ఇచ్చినా ప్రభుత్వం స్పందించలేదని అన్నారు.ప్రభుత్వ యాజమాన్యం సంస్థ సివిల్ సప్లై కార్పొరేషన్ ఆదర్శ సంస్థగా ఉండాల్సింది పోయి కార్పొరేషన్ చేసిన నిర్ణయాలను అమలు చేయకుండా సంవత్సరం గడిచిపోతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు.
సివిల్ సప్లై హమాలీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను విడుదల చేసి బకాయి హమాలి రేట్లను పెంచి సివిల్ సప్లై కార్పొరేషన్ సప్లై సమ్మెను ఆపాలని కోరారు.లేనియెడల నిరవధిక సమ్మె సాగుతుందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై హమాలీస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దోనకొండ వెంకటేశ్వర్లు, జానయ్య,హమాలీలు, మహిళా హమాలీలు పాల్గొన్నారు.