జనసెన పార్టీ క్రియాశీల సభ్యులుగా పనిచేస్తు మృతి చెందిన కుటుంబాలని పరామర్శించి 5 లక్షల ప్రమాద బీమా అందించడానికి నల్గొండ జిల్లా పర్యటనకు వెళ్తున్న జనసేన అదినేత పవన్ కళ్యాణ్. కార్యకర్తల మరియు అభిమానుల కోరిక మేరకు ఎల్ బినగర్ నియోజకవర్గం అలకాపురి వద్ద కొద్దిసేపు ఆగటం జరిగింది కార్యకర్తలు తెచ్చిన గణజమాలని స్వీకరించిన పవన్.
కార్యకర్తల్లో ఉత్తేజం నింపడానికి కొద్దిసేపు మాట్లాడటం జరిగింది.గత ఎన్నికల్లో తెలగాణలో అనివాన్య కారణాల వల్ల పోటీ చేయలేక పోయామని రానున్న ప్రతి ఎన్నికల్లో జనసేన పార్టీ బరిలో ఉంటుందని కార్యకర్తలు ఉస్తహంగా పనిచేసి తనవెంట నడిచి పార్టీ బలోపేతానికి కృషిచేయాలని తెలంగాణలో జనసేన పార్టీ జెండా ఎగరవేయాలని అన్నారు.