వెన్నునొప్పి( Back pain ) కలగడానికి ముఖ్యంగా చాలా కాలంగా కొనసాగిస్తున్న నష్టదాయకమైన అలవాట్లు ప్రధాన కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు.కంప్యూటర్ పైన నిరంతరం వొంగి పని చేయడం కూడా దీనికి ముఖ్య కారణం అని చెబుతున్నారు.
దీనినే టెక్ నెక్( Tech Neck ) అని కూడా అంటారు.మిగతా కారణాలలో ప్రమాదాలు, కండరాలు, అలిసి దెబ్బ తినడం క్రీడలలో పాల్గొన్నప్పుడు తగిలిన గాయాల వల్ల వెన్నునొప్పి బారిన పడుతారు.
సాధారణంగా వెన్నునొప్పి రోజంతా ఉంటుంది.

మెడ క్రింద భాగం నుంచి వెన్ను చివరన ఉండే టెయిల్ బోన్ దాకా వెన్ను వెంట బిగుసుకుపోయినట్లు అనిపిస్తుంది.ఎంతకు ఉపశమనం లేకుండా నొప్పి ఉండడం మెడలో, వీపు పై భాగంలో వీపు కింది భాగంలో చాలా నొప్పిగా ఉన్నట్లు అనిపిస్తుంది.ముఖ్యంగా ఏదైనా బరువు ఎత్తినప్పుడు, శ్రమతో కూడిన పనులు ఏమైనా చేసినప్పుడు నొప్పి మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
ఎక్కువసేపు కూర్చున్న, నిలబడ్డ, వీపు మధ్య క్రింద భాగాలలో నొప్పి, వీపు కింద భాగంలో నుంచి పిరుదులు, తొడలు, పిక్కలు వేళ్ళ వరకు నొప్పి ఉండడం వెన్నుముక నొప్పి లక్షణాలుగా వైద్యులు చెబుతున్నారు.

ఆధునిక కాలంలో అందరికీ వెన్నునొప్పి ఎదురవుతూనే ఉంటుంది.ఈ నొప్పి కొందరికి చాలా తక్కువగా ఉంటే కొందరికి ఎక్కువగా ఉంటుంది.వీపు దిగువ భాగంలో కండరాలు విపరీతంగా అలసిపోవడంతో వెన్నునొప్పి మొదలవుతుంది.
వీపు కింది భాగంలో ఉండే అనేక కండరాలు లిగమెంట్స్ వెన్నుపూసలకు అతుక్కుని ఉండి మొత్తం వెన్నుని వీపు మధ్యలో నిలబెట్టి ఉంచుతాయి.మనం కూర్చొని, నిలబడి పనులు చేసే సమయంలో తెలియకుండానే ఆ కండరాలు విపరీతంగా సాగేటట్లు చేస్తూ ఉంటాము.
ఫలితంగా వాటిపై ఒత్తిడి పెరిగే వెన్నునొప్పికి దారితీస్తుంది.కొంతమందిలో సాధారణమైన అలవాట్ల కారణంగా చిన్న వయసు నుంచి ఈ కండరాల పైన నిరంతరం ఒత్తిడి( Stress ) ఏర్పడుతుంది.
శ్రమతో కూడిన పని చేయడం ద్వారా కలిగే నొప్పి తాత్కాలికమే అయినా ఈ అలవాటు నిరంతరం కొనసాగితే కండరాలు బాగా అలసిపోతాయి.