తెలంగాణలో నిర్బంధాలు ఎక్కువయ్యాయి:బూర నర్సయ్య గౌడ్

హైదరాబాద్‌:ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పోల్చితే తెలంగాణలో నిర్బంధాలు ఎక్కువయ్యాయని, తాను టీఆర్ఎస్ ను ఎందుకు వీడానో ప్రజలు గ్రహించాలని భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ విజ్ఞప్తి చేశారు.బీజేపీ ఉద్యమ పార్టీ అయితే టీఆర్ఎస్ ఉద్యమ ద్రోహుల పార్టీగా రూపాంతరం చెందిందని ఘాటుగా వ్యాఖ్యానించారు.

 Arrests Have Increased In Telangana: Boora Narsaiah Goud-TeluguStop.com

గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బూర మాట్లాడాతూ ‘‘ఆత్మగౌరవం కోసం ఈటల రాజేందర్, స్వామి గౌడ్, జితేందర్ రెడ్డి,కొండా విశ్వేశ్వర్ రెడ్డి,నేను టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చామని, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.మునుగోడు ఉపఎన్నిక కారణంగా కేసీఆర్ గట్టుప్పల్ మండలాన్ని ఇచ్చారు.

కేసీఆర్‌కు ఓట్లు,సీట్లు,డబ్బులే ముఖ్యం.ఒక్కో ఎమ్మెల్యే బూత్‌కు రూ.2 కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి.సొంత పార్టీ ఎమ్మెల్యేలనే కేసీఆర్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.

ఉపఎన్నిక తరువాత వరదలాగా భాజపాలో చేరుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు.ఫ్లోరోసిస్‌ పోయిందని చెబుతున్న టీఆర్ఎస్ నేతలు ఫ్లోరోసిస్ అధ్యయన కేంద్రం ఎందుకు కోరుతున్నారు? లేని రోగానికి వైద్యం చేయడానికేనా?’’ అని బూర నర్సయ్యగౌడ్‌ ప్రశ్నించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube