హమాలీ అంటే చాలా కష్టపడుతుంటారు.చెమట ధారపోసేలా రెక్కల కష్టంతో డబ్బులు సంపాదిస్తుంటారు.
సాధారణంగా మనం రైల్వే స్టేషన్లలో సామాన్లు మోసే రైల్వే హమాలీలను చూస్తుంటారు.రెండు చేతులపైనా, తలపైనా భారీగా సూట్ కేసులు, బ్యాగులు మోసుకుంటూ కనిపిస్తారు.
ఆ తరహాలో మనం బరువులు మోయాలంటే సాధ్యపడదు.అలాంటి కష్టమైన పని సాధారణంగా తక్కువ చదువుకున్న వారు, ఈ పనికే అలవాటు పడిన వారు మాత్రమే హమాలీలుగా పని చేస్తుంటారు.రోజంతా కష్టపడితే వారికి దక్కే ఆదాయం రూ.400 నుంచి రూ.500లు ఉంటుంది.అయితే ఇలాంటి ఓ హమాలీ పోస్టు కోసం ఓ వ్యక్తి భారీగా ఖర్చు పెట్టాడు.
వేలంగా పాటలో ఆ హమాలీ పోస్టుకు దక్కిన ధర చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
తెలంగాణలోని మెదక్ జిల్లా కొల్చారం మండలం చిన్న ఘనాపూర్‌లో ఐఎంఎల్ స్వదేశీ మద్యం డిపో ఉంది.అక్కడ హమాలీ పోస్టుకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది.
అక్కడ నిత్యం పని ఉంటుంది.రోజూ రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు హమాలీలకు ఆదాయం వస్తోంది.ఇలా వారు నెలకు రూ.లక్షకు పైగానే సంపాదిస్తున్నారు.ఇక్కడి హమాలీ పోస్టుకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.ఇటీవల ఓ హమాలీ పోస్టు ఖాళీ ఏర్పడింది.దానికి అనధికారికంగా వేలంపాట పెట్టారు.
ఇందులో ఆ పోస్టుకు రూ.60 లక్షలకు పాట పాడి ఓ వ్యక్తి దక్కించుకున్నాడు.సాధారణంగా ఏదైనా ప్రభుత్వ ఉద్యోగానికి రూ.10 లక్షలు, రూ.20 లక్షలు లంచం ఇచ్చారని మనం వార్తలో వింటుంటాం.అలాంటిది ఓ హమాలీ పోస్టుకు రూ.60 లక్షలు పెట్టారని తెలియగానే అంతా ఆశ్చర్యపోతున్నారు.2006లో ఇలాగే హమాలీ పోస్టుకు వేలం పాట నిర్వహించారు.ఆ సమయంలో రూ.2 లక్షలు మాత్రమే వేలం పాటలో దక్కింది.ప్రస్తుతం ఏకంగా రూ.60 లక్షల ధర పలకడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.