మన శరీరానికి అత్యంత అవసరం అయ్యే పోషకాల్లో ప్రోటీన్ ముందు వరుసలో ఉంటుంది.ఆరోగ్య నిపుణులు సైతం ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తుంటారు.
ఈ నేపథ్యంలోనే కొందరు మార్కెట్లో లభ్యమయ్యే ప్రోటీన్ పౌడర్ ను కొనుగోలు చేసే వాడుతుంటారు.అయితే మార్కెట్లో లభ్యం అయ్యే కొన్ని ప్రోటీన్ పౌడర్స్ లో విషపూరిత లోహాలు ఎక్కువ పరిమాణంలో ఉంటాయి.
అవి మన ఆరోగ్యానికి హానికరం చేస్తాయి.కానీ ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ ప్రోటీన్ పౌడర్ ను కనుక వాడితే ఊహించని ఆరోగ్య లాభాలు మీ సొంతమవుతాయి.
అలాగే ఈ ప్రోటీన్ పౌడర్ ను వాడటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ప్రోటీన్ పౌడర్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా రెండు బీట్ రూట్ లను తీసుకుని పీల్ తొలగించి నీటిలో శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరనివ్వాలి.ఆ తర్వాత తొక్క తొలగించిన బీట్ రూట్ లను సన్నగా తరుముకుని ఎండలో బాగా ఎండబెట్టి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.

అలాగే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో రెండు కప్పుల పల్లీలు వేసుకుని వేయించుకోవాలి.ఇలా వేయించిన పల్లీలను పొట్టు తొలగించి మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో పల్లీల పౌడర్ మరియు బీట్ రూట్ పౌడర్ వేసుకోవాలి.అలాగే ఒక కప్పు బెల్లం పొడి వేసి బాగా మిక్స్ చేసుకుంటే మన ప్రోటీన్ పౌడర్ సిద్ధమవుతుంది.
ఈ ప్రోటీన్ పౌడర్ ను ఒక బాక్స్ లో నింపుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.

ప్రతిరోజు ఒక గ్లాసు పాలలో తయారు చేసుకున్న ప్రోటీన్ పౌడర్ ను వన్ టేబుల్ స్పూన్ చొప్పున కలిపి తీసుకోవాలి.ఈ హోమ్ మేడ్ ప్రోటీన్ పౌడర్ ను వాడటం వల్ల శరీరం, కండరాలు దృఢంగా మారతాయి.ఎముకలు బలంగా తయారవుతాయి.
రక్తహీనత ఉంటే దూరం అవుతుంది.నీరసం అలసట వంటివి దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.
అతి ఆకలి సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.వెయిట్ లాస్ అవుతారు.
చర్మం ఆరోగ్యంగా యవ్వనంగా మారుతుంది.జుట్టు రాలడం కంట్రోల్ అవుతుంది.
మెదడు పనితీరు చురుగ్గా మారుతుంది.ఆలోచన శక్తి జ్ఞాపక శక్తి సైతం రెట్టింపు అవుతాయి.