సోషల్ మీడియాలో పిచ్చివేషాలు వేయొద్దు:కలెక్టర్ హరి చందన

నల్లగొండ జిల్లా:లోకసభ ఎన్నికల( Lok Sabha elections ) సందర్భంగా సోషల్ మీడియాలో రాజకీయ ప్రకటనల ప్రచారం కోసం ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ (ఎంసిఎంసి) ముందస్తు అనుమతిని తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టర్,నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన ఒక ప్రకటనలో తెలిపారు.సోషల్ మీడియా(వాట్సాప్, ట్విట్టర్,ఫేస్ బుక్ ఇన్స్టాగ్రామ్)తో పాటు, ఎలక్ట్రానిక్ మీడియా, స్థానిక కేబుల్ ఛానల్లు, ఎఫ్ఎం రేడియో,ఇతర ఆన్లైన్ మీడియా,బల్క్ ఎస్ఎంఎస్ లు,వీడియో మెసేజ్లు,సినిమా థియేటర్లలో అడ్వర్టైజ్మెంట్లకు,అలాగే కరపత్రాల ముద్రణకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తప్పనిసరిగా ఎంసీఎంసీ ముందస్తు అనుమతిని తీసుకోవాలని తెలిపారు.

 Don't Go Crazy On Social Media: Collector Hari Chandana, Electronic Media, Local-TeluguStop.com

ఇందుకోసం నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ ఎంసీఎంసీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.సోషల్ మీడియాలో రాజకీయ ప్రకటనల ప్రసారం కోసం పోటీలో ఉన్న అభ్యర్థులు 24 గంటలు ముందు ఎంసిఎంసికి దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

ఎన్నికల ప్రచార కరపత్రాలలో తప్పనిసరిగా ప్రచురణకర్త పేరు, చిరునామా,ప్రింటర్ పేరు ఉండాలని,ఈ కరపత్రాలు ఎవరికి వ్యతిరేకంగా ఉండకూడదని,అంతేకాక ఏదైనా కులం,మతానికి అనుకూలంగా కానీ,కోర్టు కేసులకు సంబంధించిన అంశాలు లేకుండా 1951 ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 127 (ఎ) నియమ నిబంధనలను పాటిస్తూ ప్రచురించాలని తెలిపారు.ఒకవేళ ఎవరైనా 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించి కరపత్రాలను ముద్రించినట్లయితే సంబంధిత ప్రచురణకర్తను ప్రాసిక్యూట్ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube