సూర్యాపేటలో ఈదురు గాలులతో కూడిన వర్షం

సూర్యాపేట జిల్లా: జిల్లా కేంద్రంలో ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది.కొద్దిసేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం రావడంతో పట్టణ ప్రజలు ఎండ తీవ్రత నుండి కొద్దిగా ఉపశమనం పొందారు.

 Gusty Rain In Suryapet, Gusty Rain ,suryapet, Suryapet District, Electricity Sup-TeluguStop.com

అకాల వర్షం కారణంగా జిల్లా కేంద్రంలోని ఖమ్మం రోడ్లో బీబీగూడెం మధుర వైన్స్ వద్ద విద్యుత్ స్తంభం కూలిపోయి ట్రాఫిక్, విద్యుత్ సమస్య తలెత్తగా,కుడకుడలో ప్రభుత్వ హైస్కూల్ లో చెట్టు విరిగి పదవ తరగతి గదిపై పడింది.

ఖమ్మం రోడ్,అంజనపురి కాలనీలో జనగాం వెళ్ళే రోడ్డులో, చెట్లు నేలకొరిగి రోడ్డుకు అడ్డంగా పడ్డాయి.

దీనితో వాహనదారులు,ప్రజలు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ట్రాఫిక్ పోలీసులు,విద్యుత్ అధికారులు ఘటనా స్థలాలకు చేరుకొని విరిగిన చెట్లను తొలగించి,ట్రాఫిక్, విద్యుత్ పునరుద్ధరించే పనిలో నిమగ్నమయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube