హనుమాన్ జయంతి ఉత్సవాలు ప్రశాంతగా జరుపుకోవాలి: ఎస్పీ చందనా దీప్తి

నల్లగొండ జిల్లా: ఈ నెల 23 న హనుమాన్ జయంతి సందర్బంగా శోభయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా ఎస్పి చందనా దీప్తి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.హనుమాన్ శోభాయాత్రలో ప్రజలకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా నిర్దేశించిన మార్గం ద్వారా, సమయపాలన పాటిస్తూ శాంతియుతంగా ర్యాలీ నిర్వహించుకోవాలని,శోభ యాత్ర నిర్వహించే సమయంలో ఇతరమతాల వారి మనోభావాలను కించపరిచే విధంగా నినాదాలు చేయరాదని, మతసామరస్యంతో,సోదరభావంతో ర్యాలీ నిర్వహించుకోవాలని సూచించారు.

 Hanuman Jayanti Celebrations Should Be Celebrated Peacefully Sp Chandana Deepti,-TeluguStop.com

సామాజిక మాధ్యమాలలో అభ్యంతరకరమైన పోస్టులు,తప్పుడు ప్రచారాలను పోస్టు చేస్తూ వివాదాలకు దారి తీసే విధంగా ఉంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.జిల్లా పోలీస్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ ద్వారా 24/7 పర్యవేక్షిస్తూ నిరంతరం నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని, అలాంటి తప్పుడు ప్రచారాలను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

హనుమాన్ శోభాయాత్ర నిర్వహులు బాధ్యతగా, శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తూ పోలీసు వారి సూచనలూ పాటిస్తూ సహకరించాలన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube