హనుమాన్ జయంతి ఉత్సవాలు ప్రశాంతగా జరుపుకోవాలి: ఎస్పీ చందనా దీప్తి

నల్లగొండ జిల్లా: ఈ నెల 23 న హనుమాన్ జయంతి సందర్బంగా శోభయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా ఎస్పి చందనా దీప్తి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

హనుమాన్ శోభాయాత్రలో ప్రజలకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా నిర్దేశించిన మార్గం ద్వారా, సమయపాలన పాటిస్తూ శాంతియుతంగా ర్యాలీ నిర్వహించుకోవాలని,శోభ యాత్ర నిర్వహించే సమయంలో ఇతరమతాల వారి మనోభావాలను కించపరిచే విధంగా నినాదాలు చేయరాదని, మతసామరస్యంతో,సోదరభావంతో ర్యాలీ నిర్వహించుకోవాలని సూచించారు.

సామాజిక మాధ్యమాలలో అభ్యంతరకరమైన పోస్టులు,తప్పుడు ప్రచారాలను పోస్టు చేస్తూ వివాదాలకు దారి తీసే విధంగా ఉంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

జిల్లా పోలీస్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ ద్వారా 24/7 పర్యవేక్షిస్తూ నిరంతరం నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని, అలాంటి తప్పుడు ప్రచారాలను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

హనుమాన్ శోభాయాత్ర నిర్వహులు బాధ్యతగా, శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తూ పోలీసు వారి సూచనలూ పాటిస్తూ సహకరించాలన్నారు.

మహేష్ బాబులో నమ్రతకు నచ్చని క్వాలిటీ అదేనా.. ఆ పని చేస్తే అస్సలు ఒప్పుకోదా?