మీ జుట్టు తెల్లబ‌డుతోందా? అయితే వెంట‌నే ఇలా చేయండి!

ఇటీవ‌ల రోజుల్లో చాలా మంది చిన్న వ‌య‌సులోనే తెల్ల జుట్టు స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్నారు.ఇందుకు చాలా కార‌ణాలు ఉన్నాయి.

 Simple Home Remedy For White Hair! Home Remedy, White Hair, Black Hair, Latest N-TeluguStop.com

పోష‌కాల కొర‌త‌, కాలుష్యం, ఆహార‌పు అల‌వాట్లు, కెమిక‌ల్స్ ఎక్కువ‌గా ఉండే హెయిర్ ప్రోడెక్ట్స్‌ను వాడ‌టం, షాంపూ చేసుకునే స‌మ‌యంలో చేసే పొర‌పాట్లు వంటి కార‌ణాల వ‌ల్ల జుట్టు తెల్ల బ‌డుతూ ఉంటుంది.కొంద‌రికి వంశపారంపర్యంగా కూడా తెల్ల జుట్టు త్వ‌ర‌గా వ‌స్తుంటుంది.

ఏదేమైన‌ప్ప‌టికీ జుట్టు తెల్ల‌బ‌డుతుంటే క‌ల‌ర్స్‌తో క‌వ‌ర్ చేసుకునే బ‌దులు.ఇప్పుడు చెప్ప‌బోయే హామ్ రెమెడీని ట్రై చేస్తే సుల‌భంగా జుట్టును న‌ల్ల‌గా మార్చుకోవ‌చ్చు.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి.ముందుగా స్ట‌వ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో గ్లాస్ వాట‌ర్ పోయాలి.వాట‌ర్ హీట్ అవ్వ‌గానే వ‌న్ టేబుల్ స్పూన్ ఉసిరి పొడి, వ‌న్ టేబుల్ స్పూన్ మెంతి పొడి, రెండు టేబుల్ స్పూన్ల టీ పొడి వేసి ప‌దిహేను నిమిషాల పాటు బాగా మ‌రిగించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి.

ఇప్పుడు వాట‌ర్‌ను ఫిల్ట‌ర్ చేసుకుని చ‌ల్లార బెట్టుకోవాలి.

ఆపై ఈ హెర్బ‌ల్‌ వాట‌ర్‌ను బాటిల్‌లో నింపుకుని ఫిడ్జ్‌లో స్టోర్ చేసుకోవాలి.త‌ల స్నానం చేసేట‌ప్పుడు.

మీరు యూజ్ చేసే షాంపూకు మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల హెర్బ‌ల్‌ వాట‌ర్‌ను మిక్స్ చేసి హెయిర్ వాష్ చేసుకోవాలి.

Telugu Tips, Black, Care, Care Tips, Remedy, Latest, Long, White-Telugu Health T

ఇలా త‌ల‌స్నానం చేసిన ప్ర‌తి సారి చేస్తే గ‌నుక తెల్ల జుట్టు స‌హ‌జంగానే న‌ల్ల‌గా మారుతుంది.అంతే కాదు.జుట్టు రాల‌డం త‌గ్గు ముఖం ప‌డుతుంది.

ఆయిలీ హెయిర్, స్ప్లిట్ హెయిర్ వంటి స‌మ‌స్య‌ల‌ నుంచి విముక్తి ల‌భిస్తుంది.జుట్టు షైనీగా మారుతుంది.

మ‌రియు చుండ్రుతో తీవ్రంగా స‌త‌మ‌తం అయ్యే వారు కూడా పైన చెప్పిన విధంగా చేస్తే మంచి ఫ‌లితాలు పొందుతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube