పచ్చి కొబ్బరిని ఎండ బెట్టడం ద్వారా వచ్చేదే ఎండు కొబ్బరి.ఈ ఎండు కొబ్బరిని చాలా మంది వంటల్లో రుచి కోసం వాడుతుంటారు.
అయితే ఎండు కొబ్బరి మంచి రుచి కలిగి ఉండటమే కాదు.విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, కాల్షియం, కాపర్, సెలీనియం, మ్యాంగనీస్, ఐరన్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా అనేక రకాల న్యూట్రియంట్స్ కూడా నిండి ఉంటుంది.
అందుకే ఎండు కొబ్బరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ఎన్నో జబ్బులను కూడా నివారిస్తుంది.
ముఖ్యంగా మతి మరుపుతో బాధ పడే వారికి, తమ మెదడు చురుగ్గా మారాలని కోరుకునే వారికి ఎండు కొబ్బరి బెస్ట్ అప్షన్‌గా చెప్పుకోవచ్చు.అవును, రోజు ఎండు కొబ్బరి ముక్క తీసుకుంటే అందులో ఉండే పోషకాలు మెదడులో మైలీన్ అనే న్యూరో ఉత్పత్తిని పెంచుతాయి.
దాంతో మెదడు చురుకు గా మారుతుంది.అలాగే మెదడు లోని నరాల ఒత్తిడిని తగ్గించి మతి మరుపును నివారించే శక్తి కూడా ఎండు కొబ్బరికి ఉంది.

అలాగే ఈ మధ్య కాలంలో పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా చాలా మంది రక్త హీనత సమస్యతో బాధ పడుతున్నారు.అలాంటి వారు తమ డైలీ డైట్‌లో చిన్న ఎండు కొబ్బరి ముక్కను చేర్చుకుంటే శరీరానికి ఐరన్ ఫుష్కలంగా అందుతుంది.దాంతో రక్త హీనత పరార్ అవుతుంది.
ప్రాణాంతక వ్యాధి అయిన క్యాన్సర్ ముప్పును తగ్గించే సామర్థ్యం కూడా ఎండు కొబ్బరికి ఉంది.
గుండె ఆరోగ్యానికి కూడా ఎండు కొబ్బరి ఎంతో మేలు చేస్తుంది.అందువల్ల, ఎండు కొబ్బరిని తీసుకుంటే మంచిది.
అయితే మార్కెట్‌లో దొరికే ఎండు కొబ్బరి కాకుండా.ఇంట్లో తయారు చేసుకున్న ఎండు కొబ్బరిని వాడుకోవడమే ఉత్తమం.