బ్రెస్ట్ క్యాన్సర్‌ను గుర్తించే 'స్మార్ట్ బ్రా' గురించి మీకు తెలుసా? ఇది ఎంత ఉపయోగకరమంటే..

ఒక నూతన స్మార్ట్ బ్రాను నైజీరియన్ సంస్థ నెక్స్ట్‌వేర్ టెక్నాలజీ తయారు చేసింది.ఇందులో చిన్న అల్ట్రాసౌండ్ సెన్సార్లు ఉంటాయి.

 Bra With Built In Ultrasound Technology Details, Smart Bra, Breast Cancer,ultra-TeluguStop.com

ఈ సెన్సార్లు బ్యాటరీ సాయంతో పనిచేస్తాయి.ఈ సెన్సార్లు రొమ్మును స్కాన్ చేస్తాయి.

స్కానింగ్ సమయంలో, కణితి యొక్క స్థానం గుర్తించడం జరుగుతుంది.ఈ పరికరం సహాయంతో బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పద్ధతిని మరింత మెరుగ్గా చేయవచ్చని దీనిని రూపొందించిన బృందం చెబుతోంది.

ఈ బ్రా యాప్‌కి లింక్ అయివుంటుంది.పరీక్ష తర్వాత బ్రెస్ట్‌లో ఉన్న కణితి.

క్యాన్సర్‌ అవునో కాదో తెలుస్తుంది.పరీక్ష తర్వాత, ఫలితాలు వినియోగదారు మొబైల్ యాప్‌కు చేరుతాయి.

అక్కడ నుండి సులభంగా వివరాలు చూడవచ్చు.

రొమ్మును తనిఖీ చేయడానికి, ఈ బ్రాను మహిళ 30 నిమిషాల పాటు ధరించాలి.

దీని తర్వాత ఫలితాలను మొబైల్‌లో చూడవచ్చు.దానిని డాక్టర్‌కు షేర్ చేయవచ్చు.దీనిని డెవలప్ చేసిన రోబోటిక్స్ ఇంజనీర్ కెమిసోలా బొలారినోవా మాట్లాడుతూ.‘‘2017లో బ్రెస్ట్ క్యాన్సర్ కారణంగా మా అమ్మ చనిపోయింది.రొమ్ము క్యాన్సర్‌ని ఆలస్యంగా గుర్తించడమే ఆమె మరణానికి కారణం.ఆమె చేరిన ఆసుపత్రిలోని వార్డులో బాలికల నుండి వృద్ధుల వరకు అందరూ బ్రెస్ట్ క్యాన్సర్‌తో పోరాడుతున్నారు.ఈ వ్యాధితో పోరాడేందుకు నా వంతు పాత్ర పోషించాలని అప్పుడే అర్థమైంది.

Telugu Breast Cancer, Nextware, Nigeria, Smart Bra, Ultra Sound Bra, Ultrasound-

ఇంతకాలం మహిళలు రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం వైద్యుడి వద్దకు వెళ్లవలసి వచ్చేది.కానీ ఇప్పుడు స్మార్ట్ బ్రాల సహాయంతో ఇంట్లో కూడా సురక్షితమైన, సౌకర్యవంతమైన పరీక్ష అందుబాటులోకి వచ్చిందని కామిసోలా చెప్పారు.దీని సహాయంతో ప్రారంభ దశలో క్యాన్సర్‌ను గుర్తించడం ద్వారా మరణాల సంఖ్యను తగ్గించవచ్చు.

స్మార్ట్ బ్రా 70 శాతం వరకు కచ్చితమైన ఫలితాలను ఇస్తుందని విచారణలో వెల్లడైందని అన్నారు.ఫలితాలు 95 నుండి 97 శాతం వరకు ఖచ్చితమైనవిగా ఉండేలా మా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

ఈ ఏడాది జూలై నాటికి ఈ బ్రా మార్కెట్‌లో అందుబాటులోకి రావచ్చని కామిసోలా తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube