సినిమా అనేది రంగురంగుల ప్రపంచం.అయితే అది దూరంగా చూసేవారికి మాత్రమే.
దగ్గరికెళితేనే తెలుస్తుంది.దాని లోతు, ఎత్తుపల్లాలేమిటో అనేది.
ఇక్కడికి అనేకమంది తమ అదృష్టం పరీక్షించుకోవడానికి వెళుతూ ఉంటారు.ఈ క్రమంలో ఇక్కడ సక్సెస్ అయిన వారిని మనం వేళ్ళమీద లెక్కపెట్టొచ్చు.
అలాంటివారి పేర్లు ఇక్కడ ప్రస్తావించాల్సిన పనిలేదు… అందరికీ తెలిసిందే.నేడు ఇక్కడ సూపర్ స్టార్లుగా చెలామణీ అవుతున్నవారు ఆ కోవకు చెందుతారు.
ఇక ఇక్కడ హీరోలుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుందామని వచ్చి, మొదట్లో మంచి నటులుగా చలామణీ అయ్యి, ఆ తరువాత కనుమరుగు అయినవారి గురించి ఇక్కడ తెలుసుకుందాం.
ఈ లిస్టులో మొదటగా “వడ్డీ నవీన్” గురించి మాట్లాడుకోవాలి.
వడ్డీ నవీన్( Vadde Naveen ) ఎలాంటి సినిమాలలో చేసాడో ఇక్కడ లిస్ట్ ఇవ్వాల్సిన పనిలేదు.అతనికంటూ ఓ లేడీ ఫాలోయింగ్ ఉండేది అప్పట్లో.
పెళ్లి అనే సినిమాతో వడ్డీ నవీన్ మంచి నటుడిగా గుర్తింపు సంపాదించాడు.ఈ క్రమంలో చాలా సినిమాలలో నటించాడు.
కానీ నేడు తెలుగు తెరపై వడ్డీ నవీన్ కనుమరుగయ్యారు అని చెప్పుకోవచ్చు.ఈ లిస్టులో 2వ వాడు… “వేణు తొట్టెంపూడి.”( Venu Thottempudi ) వేణు నటన, కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.హనుమాన్ జంక్షన్, పెళ్ళాం ఊరెళితే సినిమాలో వేణు చేసిన కామెడీని ఇప్పటికీ మరచిపోలేము.
కానీ ఈ హీరో కూడా ఇపుడు ఎందుకనో సినిమాలలో కనబడడం లేదు.
ఈ లిస్టులో 3వ హీరో. “రాజా”( Raja ) కూడా అందరికీ సుపరిచితుడే.శేఖర్ కమ్ముల దర్శకుడిగా చేసిన ఆనంద్ సినిమాతో పరిచయం అయిన రాజా తరువాత కాలంలో హీరోగా మంచి మార్కులు కొట్టేసాడు.
కానీ తరువాత కాలంలో పాస్టర్ గా మారిన రాజా సినిమాలకు దూరంగా జరిగాడు.
ఈ లిస్టులో 4వ వాడు “జె డి చక్రవర్తి.”( JD chakravarthy ) చక్రవర్తి గురించి కూడా చెప్పాల్సిన అవసరం లేదు.రామ్ గోపాల్ వారసుడు అయినటువంటి చక్రవర్తి సినిమాలతో పాటు వివాదాలకు కూడా చాలా దగ్గరగా ఉంటాడు.
కొన్నేళ్ల వరకు హీరోగా చలామణీ అయిన చక్రవర్తి నేడు కనుమరుగయ్యారు అనడంలో అతిశయోక్తి లేదు.
ఇక ఇదే కోవకు చెందుతారు నటులు తరుణ్, వరుణ్ సందేశ్, నవదీప్, తనీష్, మరియు రాజ్ తరుణ్.వీరు కూడా మొదట నటులుగా మంచి మంచి సినిమాలు చేసారు.కానీ ఎందుకో మరి! సినిమా అనే రేస్ లో వెనుకబడ్డారు.
మీకు కారణాలు తెలిస్తే కింద కామెంట్ చేయండి!
.